‘ఎమర్జెన్సీ’లో ‘సత్యరాజ్’ ఫస్ట్ లుక్ !

‘ఎమర్జెన్సీ’లో ‘సత్యరాజ్’ ఫస్ట్ లుక్ !

Published on Jan 5, 2020 7:06 PM IST

sathya

‘బాహుబలి’ సినిమాలో కట్టప్ప పాత్రలో అద్భుతంగా నటించి.. ‘బాహుబలి’ సినిమాలో ప్రభాస్ తరువాత ఆ స్థాయిలో పేరు తెచ్చుకున్న నటుడు ‘సత్యరాజ్’. ఇప్పటివరకూ విలన్ గా హీరోగా 200కి పైగా సినిమాల్లో నటించిన ఆయన.. తమిళ, తెలుగు చిత్రాలతో పాటు కన్నడ, మలయాళం మరియు హిందీ సినిమాల్లో కూడా నటించి నేషనల్ లెవల్ లో పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నారు. రీసెంట్‌గా తెలుగులో వచ్చిన ‘ప్రతిరోజూ పండగే’ సినిమాలో కూడా కీలక పాత్రలో నటించి ఆ సినిమా విజయంలోనే కీలక పాత్ర పోషించారు ఈ టాలెంటెడ్ యాక్టర్.

కాగా సత్యరాజ్ ముఖ్య పాత్రలో నటిస్తున్న తాజా తమిళ చిత్రం ‘ఎమర్జెన్సీ’. ఈ సినిమా తెలుగులోనూ ఇదే పేరుతో రిలీజ్ కానుంది. రీవెంజ్ తీర్చుకునే తండ్రి పాత్రలో సత్యరాజ్ ఈ సినిమాలో కనిపించనున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ ను దర్శకుడు మారుతీ రిలీజ్ చేశారు. ఫస్ట్ లుక్ లో సత్యరాజ్ మాస్ లుక్‌‌ ఆకట్టుకుంటుంది.

ఇక ఈ ‘ఎమర్జెన్సీ’ చిత్రాన్ని హనీబీ క్రియేషన్స్ పతాకంపై సజీవ్ మీరాసాహిబ్ రాథర్ నిర్మిస్తుండగా దర్శకుడు దేరాన్ తెరకెక్కిస్తున్నారు. ఎస్.ఎన్ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు