సూపర్‌స్టార్ మహేష్ హీరోగా యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్‌టైనర్ ‘సరిలేరు నీకెవ్వరు’. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో ప్రత్యేక పాత్రలో లేడీ అమితాబ్ విజయశాంతి నటిస్తున్నారు. జనవరి 11న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని వరల్డ్‌వైడ్‌గా రిలీజ్ చేస్తున్నారు.
కాగా, ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఫంక్షన్‌ను జనవరి 5న హైదరాబాద్‌లోని లాల్‌బహదూర్ స్టేడియంలో అభిమానుల సమక్షంలో చాలా గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ మెగా సూపర్ ఫంక్షన్‌కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా… శ్రీనువైట్ల మాట్లాడుతూ – “అనిల్‌గారు, దిల్‌రాజుగారు కలిసి చేసిన ఈ సినిమాకు మెగాస్టార్, సూపర్‌స్టార్ కలవడం అనేది చాలా పెద్ద విషయం. ఈ కలయికను నిజం చేసినందుకు చిరంజీవిగారికి థ్యాంక్స్. మహేశ్‌గారితో నేను రెండు సినిమాలు చేశాను. ఆయనంటే నాకు ఎంతో ఇష్టం. అలాగే అనిల్ రావిపూడి నా రూమ్మేట్. తనతో అలా పరిచయం ఉంది. అలాగే నేను డైరెక్టర్ కాకముందు, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్ కాకముందు నుండి ఇద్దరికీ పరిచయం ఉంది. నాకు ఇష్టమైన అందరూ కలిసి చేసిన ఈ సినిమా చాలా పెద్ద హిట్ కావాలి. లాస్ట్ డికేడ్ మహేశ్‌కి దూకుడుతో శుభారంభం వచ్చింది. ఈ డికేడ్‌లో సరిలేరు నీకెవ్వరుతో శుభారంభం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను“ అన్నారు.
రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ మాట్లాడుతూ – “గొప్ప కాంబినేషన్‌లో వస్తోన్న ఈ సినిమాలో మేం కూడా భాగం కావడం చాలా ఆనందంగా ఉంది. కాశ్మీర్‌లో చిత్రీకరించిన సన్నివేశాల్లో మహేశ్‌గారిని కాస్త కష్టపెట్టాం. కొత్త యాక్షన్స్‌ను మీరు చూడబోతున్నారు. మహేశ్‌గారికి సరిపోయే టైటిల్ ఇది. ఆయన సినిమా వందశాతం కాదు.. వెయ్యి శాతం ప్రేమిస్తారు. డైరెక్టర్ అనిల్ రావిపూడి యాక్టర్ అని చెప్పాలి. నటీనటులను ఆడిస్తూ పాడిస్తూ తనకేం కావాలో దాన్ని చక్కగా తీసుకుంటారు అనిల్ రావిపూడి. లేడీ సూపర్‌స్టార్ విజయశాంతిగారిని చూస్తుంటే ఎనర్జీ చూస్తున్నట్లు అనిపించింది“ అన్నారు.
తమన్నా మాట్లాడుతూ – “చిరంజీవిగారికి థ్యాంక్స్. మహేశ్ సినిమాలో సాంగ్ చేయడం హ్యాపీ. అలాగే నేను కలిసిన మంచి వ్యక్తుల్లో డైరెక్టర్ అనిల్‌గారు ఒకరు. నాకు మంచి ఫ్రెండ్. రష్మిక మైండ్ బ్లాక్ సాంగ్‌లో మైండ్ బ్లాక్ రేంజ్‌లో చేసింది. సినిమాను అందరూ కచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. దిల్‌రాజుగారు, దేవిశ్రీ ప్రసాద్‌గారు సహా మంచి టీమ్ కలిసి చేసిన సినిమా ఇది. తప్పకుండా సినిమా పెద్ద విజయం సాధిస్తుంది“ అన్నారు.


