ఆ విషయంలో బన్నీ తగ్గడం లేదుగా..!

ఆ విషయంలో బన్నీ తగ్గడం లేదుగా..!

Published on Jan 5, 2020 9:00 PM IST

Allu arjun

బన్నీ, త్రివిక్రమ్ అల వైకుంఠపురంలో మూవీ విషయంలో కొత్తగా ఆలోచిస్తున్నారు. ముఖ్యంగా ప్రమోషన్స్ విషయంలో వీరి టెక్నిక్స్ ఓ రేంజ్ లో సక్సెస్ అవుతున్నాయి. విడుదలకు మూడు నెలల ముందే చిత్రంలోని సామజవరగమనా సాంగ్ విడుదల చేసి సూపర్ సక్సెస్ అయ్యారు. ఆ సాంగ్ ఇచ్చిన ఊపుతో వరుసగా పాటలు విడుదల చేసి సినిమాకు భారీ హైప్ క్రియేట్ చేశారు. ప్రతి పాటకు ముందు టీజర్ మరియు దానికొక ప్రత్యేక అనౌన్సమెంట్ ఇలా వరుస అప్డేట్స్ తో సినిమా జనాలలో ఉండేలా చేశారు.

ఇక రేపు మ్యూజికల్ కాన్సర్ట్ పేరుతో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నారు. దీని కొరకు సినిమాలో ముఖ్యమైన రోల్స్ చేస్తున్న సుశాంత్, నివేదా పేతు రాజ్, సునీల్ రంగంలోకి దిగారు. తమదైన శైలిలో సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేస్తున్నారు. ఇలా అల వైకుంఠపురంలో ప్రమోషన్స్ విషయంలో వినూత్నంగా ఆలోచిస్తూ దూసుకెళుతున్నారు బన్నీ టీమ్. అలవైకుంఠపురంలో చిత్రంలో బన్నీ కి జంటగా పూజ హెగ్డే నటిస్తుంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ మరియు గీతా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు