మహేష్ ఈవెంట్ ని టార్గెట్ చేసిన అల్లు అర్జున్

మహేష్ ఈవెంట్ ని టార్గెట్ చేసిన అల్లు అర్జున్

Published on Jan 6, 2020 9:44 AM IST

Mahesh Allu

నిన్న రాత్రి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా జరిగిన సరిలేరు నీకెవ్వరు ప్రీ రిలీజ్ ఈవెంట్ సూపర్ సక్సెస్ అయ్యింది. మెగా అభిమానులు మరియు మహేష్ అభిమానులతో వేదికైన ఎల్ బి స్టేడియం జన సంద్రమైంది. ఈవెంట్ కి వచ్చిన స్పందన రీత్యా చిత్ర యూనిట్ హ్యాపీగా ఉన్నారు. కాగా సంక్రాంతి బరిలో దిగుతున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురంలో చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్ నేడు యూసఫ్ గూడా పోలీస్ గ్రౌండ్స్ నందు గ్రాండ్ గా జరగనుంది. మ్యూజికల్ కాన్సర్ట్ పేరుతో భారీగా జరగనున్న ఈ ఈవెంట్ పై బన్నీ టీం ప్రత్యేక శ్రద్ద పెడుతున్నారు.

సరిలేరు నీకెవ్వరు మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ సక్సెస్ రీత్యా అంతకు మించి ఈ ఈవెంట్ సక్సెస్ అయ్యేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ వేడుకలో శాస్త్రీయ సంగీతంతో పాటు, సిద్ శ్రీరామ్ తో సామజవరగమనా సాంగ్ లైవ్ పెరఫార్మెన్స్ లాంటి అనేక ప్రత్యేకతలతో ఈవెంట్ సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే మూవీలోని నటులు ఈ కార్యక్రమం కొరకు ప్రత్యేక క్యాంపైన్ నిర్వహిస్తున్నారు. ఐతే ఈ కార్యక్రమానికి అతిధిగా ఏ స్టార్ హీరోని ప్రకటించలేదు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు