మహేష్ సినిమా అంటే తక్కువ డైలాగులు, ఎక్కువ యాక్షన్ ఉంటుంది. ఇక కామెడీ విషయానికొస్తే మహేష్ షార్ట్ లెంగ్త్ డైలాగులతోనే హాస్యాన్ని పండించే ప్రయత్నం చేసేవారు. కానీ ‘ఖలేజా’ విషయంలో మాత్రం అలా కాదు. గలగలా మాట్లాడుతూ హాస్యాన్ని పండించే భారాన్ని తన మీదే వేసుకున్నారు మహేష్ ప్రేక్షకులకు చాలా కొత్తగా కనబడ్డారు. ఆ చలాకీతనం అందరికీ నచ్చింది.
అయితే ఆ సినిమా తర్వాత మరే సినిమాలోనూ అంత ఎనర్జీతో కామెడీని పండించే ప్రయత్నం చేయలేదు మహేష్. కానీ ఇప్పుడు ‘సరిలేరు నీకెవ్వరు’ కోసం మాత్రం మరోసారి ‘ఖలేజా’ ఎనర్జీని బయటితీసినట్టే కనిపిస్తున్నారు. నిన్న విడుదలైన ట్రైలర్ చూస్తే మహేష్ హాస్యభరిత సన్నివేశాల్లో నెవర్ బిఫోర్ అనేలా పెర్ఫార్మ్ చేసినట్టు అనిపిస్తోంది. ఈ అంశమే అభిమానుల్ని ఎక్కువగా ఎగ్జైట్ చేస్తోంది. మరి మహేష్ తన ఎనర్జీతో ఎంత రచ్చ చేశారో చూడాలంటే జనవరి 11 వరకు ఆగాల్సిందే.


