సూపర్‌స్టార్ మహేష్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మించిన అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్‌టైనర్ ‘సరిలేరు నీకెవ్వరు’. జనవరి 11న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేస్తున్నారు. కాగా ఈ సందర్భంగా ఈ చిత్ర హీరోయిన్ రష్మిక మండన్నా మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు ఇప్పుడు మీ కోసం…
‘సరిలేరు నీకెవ్వరు’లో మీ క్యారెక్టర్ గురించి చెప్పండి ?
ట్రైలర్ లో చూశారు కదా. నా క్యారెక్టర్ మీకే అర్ధమైఉండాలే. ట్రైలర్ లో లాగే హీరోగారిని సినిమాలో కూడా టార్చర్ పెడతాను. అలాగే నా క్యారెక్టర్ వెరీ కామెకిల్ గా అండ్ డ్రమటిక్ గా ఉంటుంది.
మహేష్ సో స్వీట్ సో క్యూట్ అన్నారు కదా ? ఆయనలో మీకు నచ్చిన అంశం ఏమిటి ?
చాల ఉన్నాయి. ముఖ్యంగా ఆయన డౌన్ టు ఎర్త్ ఉంటారు. ఎప్పుడూ కూల్ గా చాల కామ్ గా ఉంటారు. అలాగే సరదగా కూడా ఉంటారు.
సినిమాలో మీ క్యారెక్టర్ కి మ్యానరిజమ్స్ ఉన్నాయి కదా ?
అవును. ట్రైలర్ లో చెప్పాను.. ‘మీకర్ధమవుతుందా..?” అనేది ఒకటి. ‘ఐయామ్ ఇంప్రెస్డ్’ అనే మరో మ్యానరిజమ్ కూడా ఉంటుంది. అలాగే ఫ్యామిలీకి కూడా అబ్బబ్బబ్బా అని కూడా ఉంటుంది.
విజయశాంతిగారు మిమ్మల్ని చాల దగ్గరికి తీసుకున్నారు. మీ మీద చాల ప్రేమ చూపించారు. తక్కువ టైంలోనే మీ మధ్య అంత బాండింగ్ ఎలా ఏర్పడింది ?
విజయశాంతిగారి గురించి నేను చాల విన్నాను. ఫస్ట్ టైమే క్లోజ్ గా మూవ్ అవ్వాలంటే నాకు కొంత భయం కదా.. ఆమె పెద్ద యాక్టర్, లేడి అమితాబ్. అయితే మేడమ్ తో కేరళ షెడ్యూల్ కి వెళ్ళాను. అక్కడ ఆమెతో మాట్లాడటం మొదలుపెట్టిన తరువాత.. రెండు రోజుల్లోనే మేడమ్ తో క్లోజ్ అయ్యాను. కెరీర్ గురించి కూడా మేడమ్ తో మాట్లాడేదాన్ని.
విజయశాంతితో కాంబినేషన్ సీన్స్ చేశారా ?
మా మధ్య పెద్దగా కాంబినేషన్ సీన్స్ లేవు అండి. కానీ మేం కలిసి చేసిన సీన్స్ మిమ్మల్ని బాగా ఆకట్టుకుంటాయి.
జనరల్ గా సూపర్ స్టార్స్ సినిమాలంటే.. హీరోయిన్స్ కి పెద్దగా నటించడానికి కూడా స్కోప్ ఉండదు కదా ?
నా క్యారెక్టర్ విషయంలో నేను చాల హ్యాపీగా ఉన్నాను. సినిమాలో నా క్యారెక్టర్ ఎందుకు..? ఏం చేస్తోందనే దానికి మంచి రీజన్ ఉంది. నా పాత్రకు క్లోజర్ ఉంది. పైగా నా క్యారెక్టరైజేషన్ లో కామెడీ కూడా బాగుంది.
ఈ సినిమా ఒప్పుకోవడానికి కారణం మహేష్ బాబునా ? లేక కథనా ?
ఫస్ట్ డైరెక్టర్ అనిల్ గారు కథ చెప్పినప్పుడే.. యాక్ట్ చేస్తూ చెప్పారు. నా సీన్స్ ను నేను చాల బాగా ఎంజాయ్ చేశాను. మెయిన్ గా నా క్యారెక్టర్ నాకు చాల బాగా నచ్చింది, అందుకే చేశాను. ఇక మహేష్ బాబు హీరో, విజయశాంతి మరో కీలకమైన రోల్ చేస్తున్నారు.. ఇవన్నీ బోనస్.
మీ తదుపరి సినిమాల గురించి ?
ప్రస్తుతం నితిన్ తో భీష్మ చేస్తున్నాను. ఫిబ్రవరి నుండి సుకుమార్ అండ్ బన్నీ సినిమా చేయబోతున్నాను. ఇంకా రెండు సినిమాలు ఉన్నాయి.


