మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘మా’లో చోటు చేసుకున్న వివాదాల పై స్పందించారు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ లోని సమస్యలను అక్కడ జరుగుతున్న పరిణామాలను పెద్దలు చూసుకుంటారని.. ఏ సమస్యలు ఉన్నా వాళ్లే వాటిని పరిష్కరించుకుంటారని రామ్ చరణ్ తెలిపారు. విజయవాడలోని బందర్ రోడ్డులో హ్యాపీ మొబైల్ స్టోర్ ను ఈ రోజు రామ్ చరణ్ చేతుల మీదగా ప్రారంభమైంది.
కాగా ఈ సందర్భంగా చరణ్ మీడియాతో మాట్లాడుతూ.. హ్యాపీ మొబైల్ స్టోర్ కు నేను బ్రాండ్ అంబాసిడర్ గా ఉండటం హ్యేపీగా ఉంది. ఇక నేను విజయవాడకు ఎప్పుడొచ్చినా సంతోషంగా అనిపిస్తోంది అని తెలిపారు. ఇక మా వివాదం విషయానికి వస్తే.. రాజశేఖర్ మా అసోసియేషన్ డైరీ ఆవిష్కరణ వేదికగా మీడియా ముందు మా అసోసియేషన్ లో జరుగుతున్న పరిణామాల పై తీవ్ర అసహనం వ్యక్తం చేసి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.
అయితే ‘మా’లో కేవలం ఆధిపత్యం కోసమే ఇలాంటి గొడవలు జరుగుతున్నాయట, పెద్దల ముందు కూడా ఇలా జరగడంతో.. ఇకనుండైనా అన్ని గొడవలు సమసిపోయేలా పెద్దలు చర్యలు తీసుకువాలని కొంతమంది నెటిజన్లు కోరుకుతున్నారు.


