ఫేక్ పోస్టులు పెడితే కేసు పెడతానంటున్న అల్లు శిరీష్

ఫేక్ పోస్టులు పెడితే కేసు పెడతానంటున్న అల్లు శిరీష్

Published on Jan 7, 2020 2:00 AM IST

Allu sirish1

సోషల్ మీడియా వినియోగం పెరిగినప్పటి నుండి సెలబ్రిటీలకు ఇబ్బందులు తప్పడంలేదు. ముఖ్యంగా సెలబ్రిటీల పేరిట ఫేక్ పోస్టలు పెడుతూ కొందరు అనవసర వివాదాలకు, అభిమానుల మధ్యన గొడవలకు కారణమవుతుంటారు. కొందరు నటీనటులు ఇబ్బంది ఎదురైనా ఇలాంటి వాటిని చూసీ చూడనట్టు వదిలేస్తారు. కానీ కొందరు మాత్రం గట్టిగానే రియాక్ట్ అవుతుంటారు. ప్రస్తుతం అల్లు శిరీష్ ఇదే పని చేశారు.

వేరొక స్టార్ హీరోను విమర్శిస్తూ అల్లు శిరీష్ కొన్నేళ్ల క్రితం సోషల్ మీడియా పోస్ట్ పెట్టినట్టు కొన్ని ఫొటోలు ట్విట్టర్లో ప్రత్యక్షమయ్యాయి. త్వరలో శిరీష్ సోదరుడు అల్లు అర్జున్ కొత్త సినిమా ‘అల వైకుంఠపురములో’ రిలీజ్ ఉండటంతో ఆ ఫేక్ న్యూస్ త్వరగానే వైరల్ అయింది. ఇది గమనించిన శిరీష్ ఇలాంటి ఫేక్ పోస్టులు పెట్టి నెగెటివిటీని క్రియేట్ చేయవద్దని, అలా చేస్తే తాను లీగల్ యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది హెచ్చరించారు. మరి శిరీష్ హెచ్చరికతోనైనా సదరు ఫేక్ ప్రచారం చేస్తున్న వ్యక్తులు వెనక్కు తగ్గితే మంచింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు