ఫస్ట్ లుక్ తో వచ్చిన సమంత – శర్వాల ‘జాను’ !

ఫస్ట్ లుక్ తో వచ్చిన సమంత – శర్వాల ‘జాను’ !

Published on Jan 7, 2020 10:30 AM IST

JAANU

గత ఏడాది అక్టోబర్లో విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకున్న తమిళ చిత్రం ’96’ను తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. తమిళంలో విజయ్ సేతుపతి, త్రిష జంటగా నటించగా తెలుగు రీమేక్ కోసం శర్వానంద్, సమంతలు జోడీ కట్టారు. ఒరిజినల్ వెర్షన్ ను డైరెక్ట్ చేసిన ప్రేమ్ కుమార్ ఈ తెలుగు రీమేక్ ను డైరెక్ట్ చేస్తున్నారు.

కాగా తాజాగా చిత్రబృందం ఫస్ట్ లుక్ పోస్టర్ ను అండ్ టైటిల్ ను రిలీజ్ చేసింది. ‘జాను’ అనే టైటిల్ తో ఈ సినిమా రాబోతుంది. ఇక ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా డిఫరెంట్ గా ఉంది ఎడారిలో వెళ్తున్న నాలుగు ఒంటెలు.. వాటికీ ఎదురుగా శర్వానంద్.. మొత్తానికి పోస్టర్ ఇంట్రస్టింగ్ గా ఉంది.

ప్రస్తుతం ఈ రీమేక్ షూటింగ్ చివరి దశలో ఉంది. దీంతో సినిమా విడుదలని కన్ఫర్మ్ చేసినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. మార్చిలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత దిల్ రాజు సినిమాను నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు