‘సమరసింహారెడ్డి’ సెంటిమెంట్ రిపీట్ చేయాలనుకుంటున్న బాలయ్య

‘సమరసింహారెడ్డి’ సెంటిమెంట్ రిపీట్ చేయాలనుకుంటున్న బాలయ్య

Published on Jan 7, 2020 3:34 PM IST

Balakrishna

నందమూరి బాలకృష్ణ కెరీర్లోని సూపర్ హిట్ చిత్రాల్లో ‘సమరసింహారెడ్డి, నరసింహనాయుడు’ చాలా ముఖ్యమైనవి. ఈ సినిమాలతో ఆయన క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఫ్యాన్స్ సైతం బాలయ్య నుండి ఎలాంటి సినిమా కావాలని అడిగితే ఒక ‘నరసింహనాయుడు’ ఒక ‘సమరసింహారెడ్డి’ కావాలని అంటుంటారు. ఈ రెండు చిత్రాలను డైరెక్ట్ చేసింది బి.గోపాల్.

బాలయ్యది, ఆయనది సూపర్ హిట్ కాంబినేషన్. అందుకే మరోసారి బి.గోపాల్ తో సినిమా చేయాలని అనుకుంటున్నారట. బాలయ్య వద్దకు ఒక మంచి కథ వచ్చిందని, దాన్ని బి.గోపాల్ అయితేనే సమర్థవంతంగా తెరకెక్కించగలరని అయన భావిస్తున్నారట. అన్నీ కుదిరితే బోయపాటి సినిమా తర్వాతే వీరి ప్రాజెక్ట్ ఉండే అవకాశముంది. మరి చూడాలి ఈ సూపర్ హిట్ కాంబో సెట్టవుతుందో లేదో.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు