‘ల‌క్ష్మీస్.. ఎన్టీఆర్‌కి బాలయ్య సాయం !

‘ల‌క్ష్మీస్.. ఎన్టీఆర్‌కి బాలయ్య సాయం !

Published on Jan 7, 2020 3:35 PM IST

ntr

నంద‌మూరి బాల‌కృష్ణ మనసు మంచిదని.. ఆపదలో ఉంటే అది శత్రువైన సరే ఆయన సాయం చేస్తారని ఆయనను దగ్గరిగా చూసినవాళ్ళు చెబుతుంటారు. అలాగే బాలయ్య బాబు మరోసారి త‌న ఉదార స్వ‌భావాన్ని చూపించారు. తమ మీద నెగిటివ్ ప్రచారం చేస్తూ తీసిన సినిమా ‘ల‌క్ష్మీస్ ఎన్టీఆర్‌’. ఈ సినిమాలో కీలక పాత్ర అయిన ఎన్టీఆర్ పాత్రలో నటించిన నటుడు ‘విజ‌య్‌కుమార్’ అనే స్టేజ్ ఆర్టిస్ట్. అయితే ఈయ‌న భార్య‌కు ఇటీవ‌ల‌ క్యాన్స‌ర్ సోకింది. దాంతో విజ‌య్‌కుమార్ వైద్య ఖర్చులతో ఇబ్బంది పడుతున్నాడట.

దీంతో బాలయ్య తన బ‌స‌వ తార‌కం క్యాన్స‌ర్ హాస్పిట‌ల్‌ లో ‘విజ‌య్‌కుమార్’ భార్యకు ఉచితంగా క్యాన్సర్ చికిత్సను అందిస్తున్నారట. నిజంగా ఇది మెచ్చుకోతగిన విషయమే. ఇక ఇండో అమెరికన్‌ బసవతారకం క్యాన్సర్‌ హాస్పిటల్ లో ఎంతోమంది నిరుపేదలకు బాలయ్య చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం బాలయ్య హీరోగా మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు అన్ని పూర్తి చేసుకుంది. షూటింగ్ ను సాధ్యమైనంత త్వరగా మొదలు పెట్టాలని చూస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు