హీరో సూర్యకు తమిళంలో మాత్రమే కాదు తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. అందుకే ఆయన ప్రతి చిత్రం తెలుగులో డబ్ అవుతూనే ఉంటుంది. ప్రస్తుతం ఆయన చేసిన కొత్త చిత్రం ‘సూరరై పొట్రు’ తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా’ పేరుతో రిలీజ్ కానుంది. ఈ సినిమా టీజర్ ఈరోజు సాయంత్రం 5 గంటలకు విడుదలకానుంది. ఎయిర్ డెక్కన్ విమానయాన సంస్థ ఫౌండర్ పైలట్ జీఆర్ గోపినాధ్ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కడం విశేషం.
‘గురు’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన డైరెక్టర్ సుధా కొంగర ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. తెలుగు సీనియర్ నటుడు మోహన్ బాబు ఇందులో ఓ కీలకపాత్ర చేయడం జరిగింది. అపర్ణ బాలమురళి సూర్యకి జంటగా నటిస్తుండగా, జీవీ ప్రకాష్ సంగీతం అందిస్తున్నారు. గత రెండు చిత్రాలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవడంతో ఈ చిత్రంపైనే సూర్య ఆశలు పెట్టుకున్నారు.


