షూటింగ్లో నాగర్జున బాగా ఎంజాయ్ చేస్తున్నారట

షూటింగ్లో నాగర్జున బాగా ఎంజాయ్ చేస్తున్నారట

Published on Jan 8, 2020 11:26 AM IST

nag

నాగర్జున ఎన్నో అంచానాలతో చేసిన ‘మన్మథుడు 2, ఆఫీసర్, దేవదాస్’ లాంటి చిత్రాలు అంతగా ఆడకపోవడంతో సరైన స్క్రిప్ట్ కోసం ఎదురుచూసిన ఆయన ‘వైల్డ్ డాగ్’ చిత్రానికి సైన్ చేశారు. కథ విని ఏ విధంగా అయితే నాగ్ ఎగ్జైట్ అయి సినిమాకు ఒప్పుకున్నారో అదే ఎగ్జైట్మెంట్ తో చిత్రీకరణలో పాల్గొంటున్నారట. బాగా నచ్చిన కథ కావడంతో సెట్స్ మీద ఎంతో ఎనర్జీతో కనిపిస్తున్నారట.

మొత్తానికి నాగ్ తనకు తగిన కథతోనే సినిమా చేస్తున్నారని, ఈసారి మంచి ఫలితం ఖాయమని సినీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. కొత్త దర్శకుడు అహిషోర్ సోలోమన్ డైరెక్షన్లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని మ్యాట్నీ ఎంటర్టెయిన్మెంట్ పతాకంపై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డిలు నిర్మిస్తున్నారు. ఇందులో నాగార్జున ఎన్ఐఏ ఏజెంట్ విజయ్ వర్మ పాత్రలో కనిపించనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు