ఎన్టీఆర్ చేతుల మీదుగా ‘ఎంత మంచివాడవురా’ ట్రైలర్ !

ఎన్టీఆర్ చేతుల మీదుగా ‘ఎంత మంచివాడవురా’ ట్రైలర్ !

Published on Jan 8, 2020 1:29 PM IST

entha manchivadauraa

సతీశ్ వేగేశ్న దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా రూపొందుతున్న కొత్త చిత్రం ‘ఎంత మంచివాడవురా’. కాగా తాజాగా ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ టైంను ఫిక్స్ చేసుకుంది. ఈ రోజు రాత్రి 7 గంటల 45 నిముషాలకు జూ ఎన్టీఆర్ చేతుల మీదగా ట్రైలర్ విడుదల కానుందని చిత్రబృందం పోస్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించింది. ఇక ఇటీవలే రిలీజ్ అయిన ఈ సినిమా టీజర్ నెటిజన్లను బాగా ఆకట్టుకుంది. మొత్తానికి టీజర్ సినిమా పై అంచనాలను పెంచింది. మరి ట్రైలర్ ఎలా ఉంటుందో చూడాలి.

ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ ఈ రోజు జరగనుంది. కాగా సినిమా పై ప్రేక్షకుల్లో అంచనాలు పెంచటానికి ప్రీ రిలీజ్ వేడుకకు ఎన్టీఆర్ ను తీసుకువస్తున్నారు. ఇక ఈ చిత్రానికి గోపి సుందర్ సంగీతం అందించడం జరిగింది. ఉమేశ్ గుప్త, సుభాష్ గుప్తలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో మెహ్రీన్ కథానాయకిగా నటించింది. జనవరి 15వ తేదీన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘118’ చిత్రంతో హిట్ అందుకున్న కళ్యాణ్ రామ్ ‘ఎంతమంచి వాడవురా’తో ఆ విజయాన్ని కొనసాగించాలని భావిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు