దర్బార్ లో నివేధా రోల్ విషాదకరమైనదా..?

దర్బార్ లో నివేధా రోల్ విషాదకరమైనదా..?

Published on Jan 9, 2020 1:00 AM IST

Nivetha Thomas

మలయాళ బ్యూటీ నివేదా థామస్ దర్బార్ చిత్రంలో ఓ కీలక రోల్ చేస్తున్నారు. ఆమె ఈ చిత్రంలో రజిని కాంత్ కూతురుగా కనిపించనున్నారు. కథలో కీలకమైన ఈ రోల్ పై ఒక ఆసక్తికర ప్రచారం జరుగుతుంది. నివేదా ఈ చిత్రంలో కొందరు యువకుల చేతిలో మానభంగానికి గురవుతుందట. ఆ ఘటనలో ఆమె ప్రాణాలు కోల్పోవడంతో రజిని పోలీస్ అధికారిగా వారిపై పగ తీర్చుకుంటాడట. నివేదా పై వచ్చే సన్నివేశాలు చాలా హృద్యంగా , కలచివేసేవిగా ఉంటాయని ఇండస్ట్రీలో వినిపిస్తున్న పుకార్లు. మరి ఈ వాదనలలో నిజం ఎంతుందో తెలియదు కానీ..సినిమాపై ఆసక్తిని రేపుతున్నాయి.

ఇక సంక్రాంతి బరిలో మొదటి చిత్రంగా దర్బార్ రేపు 9న విడుదల అవుతుంది. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ లో స్టార్ డైరెక్టర్ మురుగదాస్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రంలో రజినీకి హీరోయిన్ గా నయనతార నటిస్తుండగా..యంగ్ సెన్సేషన్ అనిరుధ్ మ్యూజిక్ అందించారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సూపర్ సక్సెస్ కావంతో మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి. చెన్నైలో రికార్డ్ అడ్వాన్స్ బుకింగ్స్ దర్బార్ నమోదు చేసింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు