బన్నీని ఆ విషయం కలచివేసిందట..!

బన్నీని ఆ విషయం కలచివేసిందట..!

Published on Jan 9, 2020 8:36 AM IST

Allu arjun

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సంక్రాంతి మూవీ అలవైకుంఠపురంలో విడుదలకు సిద్ధమైంది. ఈనెల 12న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది ఈ చిత్రం. దర్శకుడు త్రివిక్రమ్ బన్నీతో చేస్తున్న హ్యాట్రిక్ మూవీ కావడంతో అంచనాలు బాగున్నాయి. ఇక థమన్ స్వరపరిచిన సాంగ్స్ ఒక రేంజ్ లో హిట్ కాగా, ఆకట్టుకొనే ట్రైలర్ తో సినిమాపై అంచనాలు మరో స్థాయికి చేరాయి. ఈ చిత్రంలో బన్నీ సరసన పూజా హెగ్డే నటిస్తుండగా సుశాంత్, నివేదా పేతురాజ్ ప్రాముఖ్యం ఉన్న పాత్రలు చేస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ మరియు గీతా ఆర్ట్స్ అలవైకుంఠపురంలో చిత్రాన్ని నిర్మించారు.

కాగా చిత్ర ప్రచారంలో భాగంగా అల్లు అర్జున్ నేషనల్ మీడియాతో మాట్లాడారు. ఈ సంధర్భంలో ఇటీవల ఢిల్లీ జె ఎన్ యూ క్యాంపస్ లో విద్యార్ధులపై జరిగిన సంఘటనపై స్పందించారు. ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానంగా విద్యార్ధులపై దాడి సంఘటన తనను కలచివేసింది అన్నారు. ఇలాంటి దాడులు బాధాకరం అన్న బన్నీ ఈ వివాదానికి త్వరలోనే చక్కటి పరిష్కారం దొరుకుతుందని ఆశించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సి ఏ ఏ బిల్లుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు