శర్వానంద్, సమంత జంటగా తెరకెక్కుతున్న చిత్రం జాను. తమిళ సూపర్ హిట్ మూవీ 96 కి తెలుగు రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఇటీవలే ఈ చిత్ర ఫస్ట్ లుక్ మరియు టైటిల్ పోస్టర్ విడుదల చేశారు. మెడలో కెమెరా, వెనుక బ్యాగ్ తో ఎడారిలో ఉన్న శర్వానంద్ లుక్ కొత్తగా అనిపించింది. నేడు జాను చిత్ర టీజర్ విడుదల చేశారు. ఒకటిన్నర నిమిషాల టీజర్ మనసును కట్టిపడేసేలా ఉంది. చిన్నప్పడు ప్రేమలో పడ్డ ఒక జంట తమ జ్ఞాపకాలను వెతుక్కుంటూ మళ్ళీ వస్తే..ఎప్పుడో విడిపోయిన వారిద్దరూ మళ్ళీ ఎదురైతే ఎలా ఉంటుంది.. అనేది చాల హృద్యంగా చెప్పినట్టున్నారు.
ఒకటిన్నర నిమిషాల టీజర్ లో సమంత, శర్వాల నటన మరియు బీజీఎమ్ అద్భుతంగా ఉన్నాయి. తమిళ చిత్రానికి దర్శకత్వం వహించిన సి ప్రేమ్ కుమార్ ఈ చిత్రానికి కూడా దర్శకత్వం వహిస్తుండగా దిల్ రాజు నిర్మిస్తున్నారు. వచ్చే నెల ప్రేమికుల రోజు కానుకగా ఈ చిత్రం విడుదల చేసే యోచనలో నిర్మాతలు ఉన్నారు.
వీడియో కొరకు ఇక్కడ క్లిక్ చేయండి


