బన్నీ, మహేష్ సినిమాలకు స్పెషల్ పర్మిషన్

బన్నీ, మహేష్ సినిమాలకు స్పెషల్ పర్మిషన్

Published on Jan 10, 2020 12:00 AM IST

Sarileru Ala

పెద్ద సినిమాలు వస్తున్నాయంటే ఫ్యాన్స్ ఎర్లీ మార్నింగ్ షోల కోసం ఆతురతగా ఎదురుచూస్తుంటారు. ఈ సంక్రాంతికి విడుదలకానున్న ‘సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో’ సినిమాలకు కూడా ఎర్లీ షోస్ వేస్తే బాగుంటుందని భావించారు. డిస్ట్రిబ్యూటర్లు సైతం పెద్ద మొత్తంలో ఓపెనింగ్స్ రాబట్టలంటే అదనపు షోలు కావాలని అధికారుల్ని కోరారు.

దీంతో ప్రభుత్వం రెండు సినిమాలకు అదనపు షోలకు అనుమతులిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మహేష్ బాబు సినిమాకు 11 నుండి 24 వరకు, అల్లు అర్జున్ చిత్రానికి 12 నుండి 24 వరకు ఉదయం 7 గంటలకు స్పెషల్ షో ఒకటి ప్రదర్శించుకోవడానికి తెలంగాణ సర్కార్ పర్మిషన్ ఇచ్చింది. సో.. మొదటి 13 రోజులు రెండు సినిమాలు రోజుకు 5 షోల చొప్పున ప్రదర్శితంకానున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు