దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ – మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా రాబోతున్న అత్యున్నత భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’లో రాహుల్ రామకృష్ణ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. పైగా ఎన్టీఆర్ కి ఫ్రెండ్ రోల్ లో నటించబోతున్నాడు. త్వరలో ఆర్‌ఆర్‌ఆర్ షూటింగ్ లో కూడా జాయిన్ అవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ కి ఫ్రెండ్ అంటే.. మనోడికి మంచి క్యారెక్టరే. పైగా ఎక్కువ సీన్స్ లో కనిపిస్తాడట. ఇక ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. ధృడంగా ఉండే కొమరం భీం రోల్ కోసం ఎన్టీఆర్ ఇప్పటికే లాయిడ్ స్టీవెన్స్ పర్యవేక్షణలో కఠినమైన కసరత్తులు కూడా చేశాడు. అన్నట్టు సినిమాలో ఎన్టీఆర్ పాత్రే కాస్త ఎక్కువ ఉంటుందట.
ఇక ఇతర ముఖ్యమైన పాత్రల్లో అజయ్ దేవగన్, సముద్రఖని నటిస్తున్నారు. డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం ఫై దానయ్య ఈ సినిమాని నిర్మిస్తున్నారు. జులై 30, 2020 లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. కాగా ‘బాహుబలి’ తరవాత గ్రేట్ విజువల్ డైరెక్టర్ రాజమౌళి చేస్తున్న సినిమా కావడం, పైగా ఇద్దరు స్టార్ హీరోలు కలిసి మొదటిసారి నటిస్తుండటంతో ఈ మల్టీస్టారర్ పై ఆరంభం నుండి భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి.


