పొన్నియిన్ సెల్వన్ థాయిలాండ్ షెడ్యూల్ పూర్తి.

పొన్నియిన్ సెల్వన్ థాయిలాండ్ షెడ్యూల్ పూర్తి.

Published on Jan 10, 2020 12:34 PM IST

mani ratnam

మణి రత్నం తెరకెక్కిస్తున్న భారీ పీరియడ్ మూవీ పొన్నియిన్ సెల్వం ఫస్ట్ షెడ్యూల్ పూర్తయింది. ఈ చిత్ర ఫస్ట్ షెడ్యూల్ థాయిలాండ్ లో చిత్రీకరించారు. షెడ్యూల్ పూర్తి కావడంతో చిత్ర యూనిట్ చెన్నై చేరుకుందని సమాచారం. కల్కి కృష్ణ మూర్తి రాసిన పీరియాడిక్ స్టోరీ పొన్నియిన్ సెల్వన్ అనే నవల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతుంది. భారీ స్టార్ క్యాస్టింగ్ తో పాన్ ఇండియా లెవెల్ లో పలు భాషలలో విడుదల చేయనున్నారు.

చియాన్ విక్రమ్, కార్తీ, జయం రవి వంటి స్టార్ హీరోలతో పాటు ఐశ్వర్య రాయ్ కీర్తి సురేష్ కూడా ఈ చిత్రంలో కీలక పాత్రలు చేస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ మరియు మద్రాస్ టాకీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. టాలీవుడ్ కి చెందిన మోహన్ బాబు పొన్నియిన్ సెల్వన్ చిత్రం ప్రాధాన్యం ఉన్న రోల్ చేస్తున్నారని తెలుస్తుంది. రెండు భాగాలుగా ఈ పీరియాడిక్ చిత్రాన్ని మణిరత్నం తెరకెక్కించనున్నాడు. ఈ చిత్రానికి మణిరత్నం ఆస్థాన సంగీత దర్శకుడు ఏ ఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు