బాలీవుడ్ స్టార్ కిడ్ సారా అలీఖాన్ కి అభిమాని కారణంగా చేదు అనుభవం ఎదురైంది. రోజు వారి చర్యలో భాగంగా జిమ్ కెళ్ళి బయటికి వస్తున్న సారా అలీఖాన్‌ని ఫొటోగ్రాఫర్స్ స్టిల్స్ అడిగారు. ఆమె ఫోటోలకు ఫోజిలిస్తుండగా అక్కడున్న అభిమానులు సెల్ఫీలు అడుగగా ఆమె కారు ఎక్కకుండా ఆగారు. సెల్ఫీలు తీసుకుంటున్న సమయంలో ఓ అభిమాని ఆమె చేయిని ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నించాడు. ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ సారా, చేయిని వెనక్కి తీసేసుకుంది. అక్కడున్న సెక్యూరిటీ గార్డు అతన్ని అదుపు చేసి దూరంగా నెట్టివేశాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతుంది.
ఇక సైఫ్ అలీఖాన్ కూతురైన సారా అలీఖాన్ 2018లో కేదార్ నాథ్ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చారు. ఆ చిత్రం తరువాత ఆమె రణ్వీర్ సింగ్ నటించిన టెంపర్ హిందీ రీమేక్ సింబా చిత్రంలో నటించడం జరిగింది. ప్రస్తుతం సారా, వరుణ్ ధావన్ హీరోగా తెరకెక్కుతున్న కూలి నంబర్ వన్ తో పాటు మరో హిందీ చిత్రంలో నటిస్తున్నారు.
https://www.instagram.com/p/B7F5mDGgkc3/?utm_source=ig_web_copy_link


