‘ప్రతిరోజూ పండగే’ బాగానే రాబట్టింది !

‘ప్రతిరోజూ పండగే’ బాగానే రాబట్టింది !

Published on Jan 10, 2020 8:08 PM IST

PratiRoju

సాయి ధరమ్ తేజ్ లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘ప్రతిరోజూ పండగే’ వసూళ్లతో బాక్సాఫీస్ దుమ్ము దులిపింది. కామెడీ మరియు ఫ్యామిలీ సెంటిమెంట్ ప్రధానంగా తెరకెక్కిన ఈ చిత్రం మంచి వసూళ్లను సాధించింది. ఇప్పటివరకూ 34 కోట్లకు పైగానే ఈ సినిమా కలెక్ట్ చేసింది. ఇక ఈ చిత్రం ప్రీ-రిలీజ్ బిజినెస్ 17 కోట్లకు జరిగింది. అంటే సగానికి సగం పైగానే ఈ సినిమా లాభాలను సాధించింది. మొత్తానికి తప్పనిసరిగా హిట్ కావాల్సిన పరిస్థితుల్లో సాయి తేజ్ కి ప్రతిరోజూ పండగే మంచి హిట్ చిత్రంగా నిలిచింది.

పైగా ఈ హీరోకు తన కెరీర్ లోనే బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ సాధించడం విశేషం. మెయిన్ గా సాయి తేజ్ ఈ సినిమాతో మెగా అభిమానుల్లో ఫుల్ జోష్ నింపాడు. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని నిర్మాత బన్నీ వాసు నిర్మించారు. సాయి ధరమ్ తేజ్ కి జంటగా రాశి ఖన్నా నటించగా ఎస్ ఎస్ థమన్ సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు