విశాఖపట్నం లో వెంకటేష్ – మహేష్ బాబు చిత్రం

విశాఖపట్నం లో వెంకటేష్ – మహేష్ బాబు చిత్రం

Published on Dec 3, 2011 2:46 PM IST


చాలా సంవత్సరాల తరువాత తెలుగు చిత్రం పరిశ్రమ లో వస్తోన్న సిసలైన మల్టీ స్టారర్ చిత్రం ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’. విక్టరీ వెంకటేష్ మరియు ప్రిన్స్ మహేష్ బాబు కలిసి నటిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 15 వ తారీకు నుండి విశాఖపట్నం లో షూటింగ్ జరుపుకుంటుంది. వెంకటేష్ మీద ఒక పాట చిత్రీకరిస్తున్నట్లు గా తెలుస్తోంది. ఈ చిత్రం లో వెంకటేష్ సరసన నటించే కథానాయిక ఎంపిక ఇంకా పూర్తి కాలేదు. చాల మంది అగ్ర తారల పేర్లు వినపడినా కూడా ఏదీ ఖరారు చేయలేదు అని తెలుస్తోంది.

ఇది ఇలా ఉండగా, మహేష్ బాబు షూటింగ్ లో జనవరి నుండి పాల్గొంటారని తెలిసింది. మిక్కి మేయర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు