అన్నపూర్ణ స్టూడియో లో అక్కినేని హీరోల సందడి

అన్నపూర్ణ స్టూడియో లో అక్కినేని హీరోల సందడి

Published on Jan 11, 2020 9:00 PM IST

Akkineni

అక్కినేని హీరోలందరూ నేడు అన్నపూర్ణ స్టూడియోకి చేరుకున్నారు. ప్రతి ఏడాది సంక్రాంతి సందర్భంగా నిర్వహించే అన్నపూర్ణ స్టూడియో ప్రారంభ వార్షికోత్సవాన్ని నిర్వహించడానికి వారు ఒక్కటయ్యారు. 1975లో అన్నపూర్ణ స్టూడియో లెజెండరీ నటుడు అక్కినేని నాగేశ్వర రావు హైదరాబాద్ లో స్థాపించారు. 1976లో అప్పటి రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ ముఖ్య అతిదిగా దీనిని ప్రారంభించారు. చిత్ర పరిశ్రమను హైదరాబాద్ కి తరలించాలనే ఉద్దేశంతో ఏ ఎన్ ఆర్ అన్నపూర్ణ స్టూడియో నిర్మించారు. దశాబ్దాలుగా అనేక చిత్రాలు అన్నపూర్ణ స్టూడియోస్ నందు రూపొందుతున్నాయి.

ఈ వార్షికోత్సవ కార్యక్రమంలో అక్కినేని నాగార్జునతో పాటు, అఖిల్, నాగ చైతన్య, సుమంత్, అమల మరియు కుటుంబ సభ్యులతో పాటు, అన్నపూర్ణ స్టూడియోస్ సిబ్బంది పాల్గొన్నారు. కాగా నాగార్జున ప్రస్తుతం వైల్డ్ డాగ్ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో నాగ్ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అయిన ఎన్ ఐ ఏ అధికారిగా నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు