
సాయి ధరమ్ తేజ్ నూతన చిత్ర ప్రారంభోత్సవం కన్నుల పండుగగా జరిగింది పలువురు నటులు పరిశ్రమ పెద్దలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. చిరంజీవి,పవన్ కళ్యాణ్, కే రాఘవేంద్ర రావు,అల్లు అర్జున్ ,ఎస్ ఎస్ రాజమౌళి, సుకుమార్,వంశీ పైడిపల్లి, రామానాయుడు, దిల్ రాజు, అల్లు అరవింద్, బన్నీ వాస్, ఏ ఎస్ రవికుమార్ చౌదరి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చిరంజీవి క్లాప్ కొట్టగా పవన్ కళ్యాణ్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు కే రాఘవేంద్ర రావు గౌరవ దర్శకత్వం వహించారు. కేంద్ర టూరిజం మంత్రిగా ఎంపిక అయిన తరువాత చిరంజీవి పాల్గోన్న మొదటి కార్యక్రమం కావడంతో అందరి కళ్ళు ఈ కార్యక్రమం మీద ఉంది. ప్రారంభోత్సవం ముగిసాక చిరంజీవి మీడియా తో మాట్లాడుతూ “సాయి ధరమ్ తేజ్ నా మేనల్లుడే కాదు నాకు కొడుకు లాంటి వాడు, కష్టపడే తత్వం తనది భవిష్యత్తులో మంచి నటుడు అవుతాడు గీతా ఆర్ట్స్ కి మెగా ఫ్యామిలీ కి ఉన్న బంధం తెలిసిందే రామ్ చరణ్ రెండవ చిత్రం ఈ బ్యానర్ లో చేశాడు ఇప్పుడు సాయి ధరమ్ తేజ్ కూడా తన రెండవ చిత్రాన్ని ఈ బ్యానర్ లో చెయ్యడం చాలా ఆనందంగా ఉంది” అని అన్నారు ఈ చిత్రాన్ని డిసెంబర్ 5న మొదలు పెట్టనున్నారు వచ్చే ఏడాది మే 10న చిత్ర విడుదల చెయ్యాలని నిర్మాతలు అనుకుంటున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి దాశరధి శివేంద్ర సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
సాయి ధరమ్ తేజ్ నా కొడుకు లాంటి వాడు – చిరంజీవి
సాయి ధరమ్ తేజ్ నా కొడుకు లాంటి వాడు – చిరంజీవి
Published on Nov 24, 2012 4:27 PM IST
సంబంధిత సమాచారం
- ‘రాకా’లోకి ఎంటర్ కానున్న హాలీవుడ్ స్టార్?
- పోల్: వెంకటేష్-కళ్యాణ్ రామ్ మూవీకి ‘జనవరి 12 విడుదల’ అనే టైటిల్ ఎలా అనిపించింది?
- అభిమానికి రామ్ అభయం: అరుదైన వ్యాధితో బాధపడుతున్న అమ్మాయికి ఆర్థిక, వైద్య సాయం!
- వెంకటేష్-కళ్యాణ్ రామ్ సంక్రాంతి మూవీ టైటిల్ ఫిక్స్: ఫన్నీ వీడియోతో ‘జనవరి 12 విడుదల’ అనౌన్స్మెంట్!
- మారుతిగా మారిన సంగీత్ శోభన్.. గ్లింప్స్ వచ్చేది ఆరోజే..!
- ‘ఇరుముడి’ కోసం రవితేజ ఇంకాస్త స్పీడ్ పెంచాల్సిందే..!
- ఓటీటీలోకి ఘట్టమనేని జయకృష్ణ డెబ్యూ మూవీ: ‘శ్రీనివాస మంగాపురం’ స్ట్రీమింగ్ వివరాలివే!
- షాకింగ్ బజ్: రజినీకి వ్యతిరేకంగా రామ్ పోతినేని?
- ‘టాక్సిక్’ తెలుగు గ్రాండ్ ప్రీరిలీజ్ ఈవెంట్ డేట్, వేదిక ఖరారు!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- రవితేజ ‘ఇరుముడి’ సెన్సార్ పూర్తి: సర్టిఫికెట్.. రన్టైమ్ డీటెయిల్స్!
- వీక్ డేస్ లో కూడా ఆగని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’.. స్ట్రాంగ్ బుకింగ్స్
- సాలిడ్ ఓపెనింగ్స్ దిశగా ‘ఇరుముడి’.. రవితేజ క్రేజ్ మామూలుగా లేదుగా..!
- రూ.లక్ష బడ్జెట్.. రూ.20 కోట్ల వసూళ్లు: చెత్త సినిమా అంటూ ట్రోలింగ్.. థియేటర్లలో కలెక్షన్ల వర్షం!
- ఎన్టీఆర్తో వెంకీ అట్లూరి కాంబినేషన్.. సెట్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్..!
- మెగాస్టార్ బర్త్ డే బ్లాస్ట్.. 158వ సినిమా టైటిల్ టీజర్ కి ఊహించని ప్లానింగ్!
- ఎన్టీఆర్-త్రివిక్రమ్ ప్రాజెక్ట్.. ‘గాడ్ ఆఫ్ వార్’తో పాటు మరో క్రేజీ టైటిల్..?
- మళ్లీ సందడి చేయబోతున్న ఎవర్గ్రీన్ రొమాంటిక్ క్లాసిక్ ‘గీతాంజలి’

