పవన్ సినిమా కోసం ప్రత్యేకమైన పడవ సెట్

పవన్ సినిమా కోసం ప్రత్యేకమైన పడవ సెట్

Published on Feb 19, 2020 10:19 PM IST

pawan

పవన్ కళ్యాణ్ ఏకకాలంలో ‘పింక్’ రీమేక్, క్రిష్ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ రెండు చిత్రాల్లో క్రిష్ సినిమా ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని రేకెత్తిస్తోంది. కారణం కథ పిరియాడికల్ బ్యాక్ డ్రాప్లో ఉండటమే. పైగా ఇందులో పవన్ రాబిన్ హుడ్ తరహా పాత్ర చేస్తున్నారని వస్తున్న వార్తలు మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఇప్పటికే ఒక షెడ్యూల్ ముగియగా కొత్త షెడ్యూల్ ఈరోజు మొదలుపెట్టడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఇందుకోసం ప్రత్యేకంగా ఒక భారీ పడవ సెట్ నిర్మించారు. ఇందులో సన్నివేశాలతో పాటు ఫైట్స్ కూడా చిత్రీకరిస్తారని తెలుస్తోంది. ఇండస్ట్రీ వర్గాల సమాచారం మేరకు ఈ చిత్రానికి ‘విరూపాక్ష’ అనే పేరును అనుకుంటున్నారని తెలుస్తోంది. ప్రముఖ నిర్మాత ఏ ఎమ్ రత్నం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్ ఎవరనేది కూడా ఫైనల్ కాలేదు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు