భారతీయుడు 2 కే ఎందుకిలా..?

భారతీయుడు 2 కే ఎందుకిలా..?

Published on Feb 20, 2020 9:48 AM IST

శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా తెరకెక్కుతున్న భారతీయుడు 2 షూటింగ్ సెట్స్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఏకంగా ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా, దర్శకుడు శంకర్ తో పాటు మరికొందరు సిబ్బంది తీవ్ర గాయాలపాలయ్యారు. ఓ భారీ క్రేన్ ఒక్కసరిగా కిందపడటంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.చెన్నై నగర శివారులోని ఓ స్టూడియో నందు యాక్షన్ సన్నివేశం చిత్రీకరిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

ఐతే ఎదో సెంటిమెంట్ వెంటాడుతున్నట్లు భారతీయుడు 2 చిత్రం మొదలుపెట్టినప్పటి నుండి అనేక అవాంతరాలు చోటు చేసుకుంటున్నాయి. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఈ ప్రాజెక్ట్ కొన్ని రోజులు నిలిచిపోయింది. నిర్మాతలకు దర్శకుడు కి మధ్య సయోధ్య కుదరడంతో మళ్ళీ సినిమా పట్టాలెక్కింది. అలాగే ఈ మూవీ ప్రారంభం తరువాత కమల్ తన నివాసంలో స్వల్ప ప్రమాదానికి గురయ్యారు. దీని కారణంగా అయన కోలుకునే వరకు షూటింగ్ ఆగిపోయింది. ఇక కొద్దిరోజులలో మూవీ షూటింగ్ పూర్తి కానున్న తరుణంలో ఈ ప్రమాదం జరిగింది. భారతీయుడు 2, ఏప్రిల్ నెలలో విడుదల కావాల్సివుండగా, మరింత ఆలస్యం అయ్యే అవకాశం కలదు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు