విక్టరీ వెంకటేష్ 74వ చిత్రం ‘నారప్ప’ రెగ్యులర్ షూటింగ్ శరవేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా గురించి ఒక ఇంట్రస్టింగ్ అప్ డేట్ తెలిసింది. ప్రియమణి హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాలో రెండవ హీరోయిన్ పాత్రలో మలయాళ నటి రెబ్బ మోనిక జాన్ కనిపించనుంది. కాగా ఈ రోజు షూట్ లో ఆమె పాల్గొన్నట్లు తెలుస్తోంది. వెంకటేష్ అండ్ ఆమె పై కొన్ని కీలక సన్నివేశాలను షూట్ చేస్తున్నారట.
ఇక తమిళ్లో బ్లాక్ బస్టర్ హిట్‌గా సంచలనం సృష్టించిన ‘అసురన్’ చిత్రానికి ఇది రీమేక్. ఈ చిత్రాన్ని శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో సురేష్ ప్రొడక్షన్స్ ప్రై.లి, వి క్రియేషన్స్ పతాకాలపై డి.సురేష్‌బాబు, కలైపులి ఎస్. థాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్‌కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ‘నారప్ప’ గెటప్‌లో విక్టరీ వెంకటేష్ లుక్ చాలా ఇంటెన్స్‌గా ఉంది.
మాస్ గెటప్‌లో పూర్తి వైవిధ్యంగా కనిపిస్తూ సర్ప్రైజ్ చేశారు విక్టరీ వెంకటేష్. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సామ్.కె నాయుడు, సంగీతం: మణిశర్మ, ఎడిటర్: మార్తాండ్ కె. వెంకటేష్,