ఉల్లాసంగా, ఉత్సాహంగా హీరో హీరోయిన్లు

ఉల్లాసంగా, ఉత్సాహంగా హీరో హీరోయిన్లు

Published on Mar 22, 2020 10:19 AM IST

hero

కరోనా వైరస్ వ్యాప్తి నివారణలో భాగంగా కొన్ని రోజులుగా సినిమా షూటింగ్స్ అన్నీ నిలిచిపోయిన సంగతి తెలిసిందే. సినిమాలకు సంభందించిన ఎలాంటి పనులూ జరగడంలేదు. దీంతో తరచూ బిజీగా గడుపుతున్న హీరో హీరోయిన్లు, నటీనటులంతా రిలాక్స్ అవుతున్నారు. విదేశాల నుండి తిరిగి వచ్చిన వారైతే భాధ్యతగా తమంతట తామే స్వీయ నిర్భందంలోకి వెళ్లారు.

ఇక ఈరోజు ప్రధాని మోదీ పిలుపు మేరకు దేశమంతా జనతా కర్ఫ్యూ నడుస్తోంది. దీంతో జనమంతా ఇళ్లకే పరిమితమయ్యారు. సెలబ్రిటీలంతా మోదీ పిలుపుకు మద్దతు తెలిపారు. ఛాన్నాళ్ల తర్వాత ఇంతటి ఫ్రీ టైమ్ దొరకడంతో స్టార్లంతా కుటుంబాలతో సేద తీరుతున్నారు. కొందరు ఆటలతో టైమ్ పాస్ చేస్తుంటే ఇంకొందరు భార్యా పిల్లలతో కలిసి జాలీగా గడుపుతూ ఛాన్నాళ్ల తర్వాతా కుటుంబంతో పూర్తి సమయం గడిపే అవకాశం వచ్చిందని, దీన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుంటామని అంటున్నారు.

family

తాజా వార్తలు