లాక్ డౌన్ రివ్యూ : ‘మేడ్ ఇన్ హెవెన్’ – హిందీ వెబ్ సిరీస్ (అమెజాన్ ప్రైమ్)

లాక్ డౌన్ రివ్యూ : ‘మేడ్ ఇన్ హెవెన్’ – హిందీ వెబ్ సిరీస్ (అమెజాన్ ప్రైమ్)

Published on Apr 28, 2020 1:19 PM IST

ఈ లాక్ డౌన్ సమయంలో సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లను సమీక్షించే శ్రేణిని కొనసాగిస్తూ.. నేటి సమీక్షగా వచ్చిన వెబ్ సిరీస్.. హిందీ వెబ్ సిరీస్ ‘ మేడ్ ఇన్ హెవెన్’. ఈ వెబ్ ధారావాహిక జోయా అక్తర్ మరియు రీమా కాట్గి చేత సృష్టించబడింది. ఈ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉంది. (మీరు ఇంగ్లీషులో కూడా చూడవచ్చు) మరి ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందో సమీక్షలో చూద్దాం.

 

కథా నేపథ్యం :

మేడ్ ఇన్ హెవెన్ అనే వెడ్డింగ్ ఏజెన్సీని నడుపుతున్న తారా ఖన్నా (శోభిత ధూళిపాళ) మరియు అర్జున్ మాథుర్ (కరణ్ మెహ్రా) జీవితాలలలో చోటు చేసుకున్న సంఘటనలతో ఈ వెబ్ సిరీస్ సాగుతుంది. స్వలింగ సంపర్కుడైన అర్జున్ కి ఈ సమాజం నుండి కొన్ని సమస్యలు ఎదురవుతాయి. ఆ సమస్యలను అర్జున్ ఎలా పేస్ చేశాడు ? అసలు ఆ సమస్యలు ఏమిటి ? అలాగే తారా బడా వ్యాపారవేత్త అయిన ఆదిల్ ఖన్నా (జిమ్ సర్బ్) ను వివాహం చేసుకుంటుంది. అయితే ఆమె కొన్ని అభద్రతాభావాలతో బాధ పడుతూ ఉంటుంది. ఈ క్రమంలో చోటు చేసుకున్న నాటకీయ పరిణామాలు ఏమిటి ? తారా మరియు అర్జున్ వారి స్వంత సమస్యల మధ్య వివాహ సమస్యలను ఎలా పరిష్కరిస్తారు? అనేదే మిగిలిన కథ.

 

ఏం బాగుంది ?

ఇటీవల వచ్చిన వెబ్ సిరీస్ లలో ఈ వెబ్ సిరీస్ ఉత్తమమైన వాటిలో ఒకటిగా నిలుస్తోంది. శోభిత ధూళిపాళ ‘తారా ఖన్నాగా’ అద్భుతంగా నటించింది. ఆ పాత్రలో దాగి ఉన్న లోతైన భావోద్వేగాలను ఎక్స్ ప్రెస్ చేసే సన్నివేశాల్లో ఆమె నటన అద్భుతమైనది. ఇక కరణ్ మెహ్రా కూడా తన స్వలింగ సంపర్క పాత్రలో చాలా బాగా నటించాడు. మొత్తంగా మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.

ఇక విలాసవంతమైన ఢిల్లీ సంస్కృతిని కూడా బాగా ఎలివేట్ చేశారు. అలాగే భారతీయ వివాహాలలో జరిగే సంఘటనలను కూడా చాలా బాగా చూపించారు.

ప్రతి ఎపిసోడ్‌లోని మలుపులు మరియు ప్రతి పాత్ర వెనుక దాని ఉన్న సంఘర్షణ నిజంగా చాలా బాగా ఆలోచింపజేస్తోంది. అలాగే కొన్ని ట్విస్ట్ లు కూడా మిమ్మల్ని పూర్తిగా షాక్ కి గురి చేస్తాయి.

 

చివరి మాటగా ?

మొత్తంమీద, ఈ ‘మేడ్ ఇన్ హెవెన్’ ఒక అద్భుతమైన వెబ్ సిరీస్, బోల్డ్, ఎమోషనల్ మరియు మలుపులతో పాటు ఆశ్చర్యకరమైన సంఘటనలతో సాగుతూ ఆకట్టుకుంటుంది. కొన్ని దృశ్యాలు చాల బాగున్నాయి. అయితే అక్కడక్కడా స్లోగా సాగే సీన్స్ కాస్త బోర్ కొట్టిస్తాయి. పైగా ఇది పెద్దల వీక్షణ కోసం మాత్రమే. ఓవరాల్ గా అద్భుతమైన ప్రదర్శనలతో పాటు మంచి డ్రామాతో సాగే ఈ వెబ్ సిరీస్ ని హ్యాపీగా చూడొచ్చు.

123telugu.com Rating : 3.5/5

సంబంధిత సమాచారం

తాజా వార్తలు