‘తలైవి’లో ముఖ్యమైన ఘట్టాలు అవే !

‘తలైవి’లో ముఖ్యమైన ఘట్టాలు అవే !

Published on Jun 7, 2020 11:06 AM IST

Thalaivi 1

తమిళనాట అభిమాన దివంగత ముఖ్యమంత్రి అమ్మ ‘జయలలిత’ జీవితం ఆధారంగా ‘తలైవి’ పేరుతో బయోపిక్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అయితే.. ఈ సినిమాలో పలు ఆసక్తికరమైన విషయాలు కూడా ఉంటాయట. రాజకీయంగా జయలలిత పై జరిగిన కుట్రలు, అసెంబ్లీలో ఆమె పై జరిగిన దాడుల్లో అప్పటి ముఖ్యమంత్రి కరుణానిధి పాత్ర ఎంత ఉంది లాంటి అంశాలను ఈ సినిమాలో చూపించబోతున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా జయలలిత జీవితంలోని ముఖ్యమైన ఘట్టాలతో పాటు ఆమె ఆలోచనా విధానాన్ని కూడా సినిమాలో హైలైట్ చేస్తూ స్క్రీన్ ప్లే సాగుతుందట.

ఇక జయలలిత పాత్రలో బోల్డ్ బ్యూటీ కంగనా రనౌత్ నటిస్తోంది. కంగనా రనౌత్ మొత్తం ఐదు గెటప్స్ లో కనిపించబోతుందట. జయలలిత జీవితంలోని ముఖ్యమైన ఘట్టాలతో పాటు ఆమె చివరి రోజులను కూడా ఈ సినిమాలో చూపించనున్నారు. దాంతో కంగనా 18 ఏళ్ల వయసు పాత్ర నుండి నుండి 60 ఏళ్ల వయసు గల పాత్ర వరకూ ఈ చిత్రంలో కనిపించనుంది.

కాగా ఈ చిత్రం హిందీ మరియు తమిళంతో పాటు మిగిలిన భాషల్లో కూడా భారీ స్థాయిలో రిలీజ్ కానుంది. పైగా అమ్మ బయోపిక్ కాబట్టి తమిళంలో కూడా భారీ డిమాండ్ ఉంటుంది. ఇక తెలుగు కన్నడ మలయాళ పరిశ్రమల్లో కూడా ఈ బయోపిక్ పై మంచి అంచనాలే ఉన్నాయి.

తాజా వార్తలు