జై బాలయ్య… అంటున్న ఎన్టీఆర్..!

జై బాలయ్య… అంటున్న ఎన్టీఆర్..!

Published on Jun 10, 2020 8:26 AM IST

Balakrishna NTR

బాబాయ్ బాలయ్య విశిష్టమైన పుట్టినరోజు అబ్బాయ్ ఎన్టీఆర్ అరుదైన సందేశంతో విషెష్ చెప్పారు. ట్విట్టర్ వేదికగా బాలయ్యపై తనకున్న అభిమానాన్ని,ప్రేమను తెలియజేశారు. ఎన్టీఆర్ ”నా లోని అభిమానిని తట్టి లేపింది మీరే..నాకు ఊహ తెలిశాక చూసిన మొట్టమొదటి హీరో మీరే..ఈ 60వ పుట్టినరోజు మీ జీవితంలో మరపురానిది కావాలని, మీరు ఆయురారోగ్యాలతో సంతోషం గా ఉండాలని కోరుకుంటున్నాను. ఐ విష్ యూ వెరీ హ్యాపీ బర్త్ డే బాబాయ్ . జై బాలయ్య !” అని పోస్ట్ చేశారు. బాలయ్య పుట్టిన రోజుకు అంత ఆత్మీయ సందేశం పంపిన అబ్బాయిని నందమూరి ఫ్యాన్స్ ఆకాశంలోకి ఎత్తేస్తున్నారు. ఎన్టీఆర్,బాలయ్యలకు తిరుగు లేదంటూ ఉబ్బితబ్బిబ్బవుతున్నారు.

ఇక బాలయ్య నేడు కుటుంబ సభ్యులతో కలిసి షష్ఠి పూర్తి కార్యక్రమం జరుపుకోనుండగా ఆ వేడుకలో ఎన్టీఆర్ పాల్గొనే అవకాశం ఉంది. ఈ మధ్య కాలంలో సంధర్భం లేకపోవడం వలన వీరిద్దరూ ఒకే వేడుకలో కలిసి కనిపించలేదు. నేడు బాలయ్య మరియు ఎన్టీఆర్ కలిసి వేదిక పంచుకొనే సూచనలు ఉన్నాయి. ఈ విషయంపై నందమూరి అభిమానులలో ఆసక్తి నెలకొనివుంది.

తాజా వార్తలు