మెగాస్టార్ చిరంజీవి తన మిత్రుడు బాలకృష్ణకు పుట్టిన రోజులు శుభాకాంక్షలు తెలిపారు. 60లో అడుగుపెడుతున్న మా బాలకృష్ణకు షష్ఠి పూర్తి శుభాకాంక్షలు, ఇదే ఉత్సాహం, ఉత్తేజంతో, ఆయురారోగ్యాలతో వంద వసంతాల సంబరం కూడా జరుపుకోవాలని కాంక్షించారు. ట్విట్టర్ వేదికగా చిరంజీవి హీరో బాలకృష్ణకు ఆత్మీయ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.
మెగాస్టార్ చిరంజీవి బాలకృష్ణకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలపడం, అటు పరిశ్రమ వర్గాలతో పాటు, మెగా మరియు నందమూరి అభిమానులలో ప్రాధాన్యత సంతరించుకుంది.ఇటీవల చిత్ర పరిశ్రమకు సంబంధించి తెలంగాణా ప్రభుత్వంతో జరిగిన కొన్ని కీలక సన్నివేశాలకు బాలయ్యను పిలవని కారణంగా… బాలయ్య చిరుతో పాటు, కొందరు చిత్ర ప్రముఖులను ఉద్దేసింది కొన్ని ఘాటు విమర్శలు చేశారు. బాలయ్య వ్యాఖ్యలపై నాగబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనితో చిరు మరియు బాలయ్య మధ్య అంతరం పెరిగిందని అందరూ భావిస్తున్న తరుణంలో బాలయ్యకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పి చిరు వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టారు. చిన్న చిన్న మనస్పర్థలు వచ్చినా, బాలకృష్ణకు చిరంజీవి మంచి ఆప్తుడన్న విషయం నేటితో అర్థం అయ్యింది. ఇక ఈ మధ్యనే సోషల్ మీడియాలోకి ఎంటరైన చిరంజీవి అనేక ముఖ్య సందర్భాలపై స్పందిస్తూ తన ప్రత్యేకత చాటుకున్నారు
60లో అడుగుపెడుతున్న మా బాలకృష్ణకి షష్టి పూర్తి శుభాకాంక్షలు.ఇదే ఉత్సాహంతో ,ఉత్తేజంతో
ఆయురారోగ్యాలతో నిండునూరేళ్ల సంబరం కూడా జరుపుకోవాలని,అందరి అభిమానం ఇలాగే పొందాలని కోరుకుంటున్నాను.Dear #NBK as U turn the magical 60,I fondly reminisce on Ur amazing journey.Happy birthday— Chiranjeevi Konidela (@KChiruTweets) June 10, 2020


