ఆ స్టార్ డైరెక్టర్ నెక్స్ట్ మూవీ యంగ్ హీరోతో?

ఆ స్టార్ డైరెక్టర్ నెక్స్ట్ మూవీ యంగ్ హీరోతో?

Published on Jun 11, 2020 8:30 AM IST

surender reddy

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ లో ఒకరిగా ఉన్న సురేంధర్ రెడ్డి మొదటి ఛాయిస్ స్టార్ హీరోలే. దాదాపు 15ఏళ్ల కెరీర్ లో ఈయన చేసిన కొద్ది సినిమాలు స్టార్ హీరోలతోనే చేశారు. ఈయన డెబ్యూ మూవీ మాత్రం కళ్యాణ్ రామ్ తో చేయడం జరిగింది. గత ఏడాది చిరంజీవి హీరోగా సైరా నరసింహరెడ్డి అనే భారీ పాన్ ఇండియా చిత్రం తెరకెక్కించారు. ఆ సినిమా విడుదలై ఆరు నెలల అవుతున్నా, ఆయన కొత్త మూవీ ప్రకటించ లేదు.

ఆయన నెక్స్ట్ మూవీ కూడా ఓ స్టార్ హీరోతో చేయాలని ప్రయత్నించినా అది కుదరలేదు. పరిశ్రమలో అందరు స్టార్ హీరోలు బిజీగా ఉండడమే దీనికి కారణం. ఈ నేపథ్యంలో ఈ సారి యంగ్ హీరోతో మూవీ చేయడం తప్ప మరో దారి కనిపించడం లేదు. ఎనర్జిటిక్ హీరో రామ్ తో ఆయన సినిమా చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. రెడ్ మూవీ పూర్తి అయిన వెంటనే ఈ చిత్రం పట్టాలెక్కే సూచనలు కనిపిస్తున్నాయి. టాలీవుడ్ స్టార్ హీరోలు ఫ్రీ అయ్యే లోపు ఓ మూవీ చేసుకోవడం మంచిది అని ఆయన ఆలోచనట.

తాజా వార్తలు