రజిని కాంత్ ఇంట్లో బాంబ్..అత్యవసర సిబ్బందికి కాల్.

రజిని కాంత్ ఇంట్లో బాంబ్..అత్యవసర సిబ్బందికి కాల్.

Published on Jun 18, 2020 5:08 PM IST

Rajinikanth 1

సూపర్ స్టార్ రజినీకాంత్ ఇంటిలో ఆవరణలో కొంత సమయం ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆయన ఇంటిలో ఎవరో బాంబు పెట్టారన్న సమాచారం అందుకున్న భద్రతా సిబ్బంది డాగ్ స్కాడ్ మరియు బాంబు స్కాడ్ తో దిగిపోయారు. చాల సమయం రజిని ఇంటి ఆవరణలో వెతకడం జరిగింది. చివరికి అక్కడ ఎటువంటి పేలుడు పదార్ధాలు కనిపించక పోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

ఇది ఎవరో ఆకతాయి చేసిన ఫ్రాంక్ కాల్ అని వారు నిర్ధారించారు. కేసు నమోదు చేసిన పోలీసులు అతని కోసం విచారణ మొదలుపెట్టారు. ఈ వార్త బయటకు రావడంతో రజిని అభిమానులు కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. ప్రస్తుతం రాజకీయాలలో కూడా ఉంటున్న రజని కాంత్ పై ప్రత్యర్ధులు ఎవరైనా ఇలాంటి చర్యకు పాల్పడ్డారేమో అని మొదట అందరూ భావించారు.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు