ఆరడుగుల అందగాడట..వైరల్ అవుతున్న నిహారిక-చైతు ఫోటోలు

ఆరడుగుల అందగాడట..వైరల్ అవుతున్న నిహారిక-చైతు ఫోటోలు

Published on Jun 19, 2020 11:30 AM IST

niharika fiancee

మెగా డాటర్ నిహారిక నిన్న సోషల్ మీడియా వేదికగా తన కాబోయే భర్తను పరిచయం చేసింది. హీరోయిన్ గా కెరీర్ మొదలుపెట్టిన నిహారికకు నాగబాబు చాలా త్వరగానే పెళ్లి సెట్ చేశారు. ఆయన రెండు నెలకు ముందే నిహారిక పెళ్లి ఆలోచన బయటపెట్టగా, సంబంధం కుదిర్చి అన్నమాట నిలబెట్టుకున్నాడు. ఇక కాబోయే భర్త విషయంలో నిహారిక చాలా హ్యాపీగా ఉన్నట్లు వారిద్దరి ఫోటోలు చూస్తే అర్థం అవుతుంది.

గుంటూరుకు చెందిన వెంకట చైత్యన్య ఆరడగుల ఎత్తు, చార్మింగ్ కలిగి.. హీరోకు ఏమాత్రం తగ్గకుండా ఉన్నాడు. వీరిద్దరి జంట చాలా ముచ్చటగా ఉంది. వీరిద్దరి ఫోటోలు బయటికి వచ్చినప్పటి నుండి మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటూ సోషల్ మీడియాలో ప్రశంశల జల్లు వెల్లువెత్తుతుంది. ఇక నిహారికకు సరైన జోడు దొరికిందని అభినందిస్తున్నారు. కాగా నిహారిక-చైతన్య ఆగస్టు లో నిశ్చితార్ధం చేసుకోనున్నారు. ఆ వెంటనే పెళ్లి కూడా జరిగే సూచనలు కలవు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు