ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ పై రాజమౌళి ఆలోచన అదేనా?

ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ పై రాజమౌళి ఆలోచన అదేనా?

Published on Jun 19, 2020 12:58 PM IST

rrr 4

ఆర్ ఆర్ ఆర్ సినిమా పట్ల దేశవ్యాప్తంగా భారీ డిమాండ్ నెలకొని ఉండగా లాక్ డౌన్ పరిస్థితులు ఆ చిత్ర షూటింగ్ ముందుకు సాగనివ్వడం లేదు. మూడు నెలలుగా కొనసాగుతున్న లాక్ డౌన్ కారణంగా ఆర్ ఆర్ ఆర్ విడుదల మరింత ఆలస్యం అయ్యేలా కనిపిస్తుంది. ఒకసారి ఆర్ ఆర్ ఆర్ విడుదల జనవరి 2021కి వాయిదా వేసిన చిత్ర బృందం.. ఆ తేదీకి రావడం కష్టమే అని తేల్చిపారేశారు.

షూటింగ్స్ అనుమతి వచ్చిన నేపథ్యంలో ఓ భారీ సెట్ లో పరిమిత సిబ్బందితో అందుబాటులో ఉన్న నటులతో కొన్ని సన్నివేశాల చిత్రీకరణ జరపాలని రాజమౌళి భావిస్తున్నారు. దీని కోసం ఇప్పటికే ఓ భారీ సెట్ హైదరాబాద్ లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇంత పెద్ద సినిమా పరిమిత సిబ్బందితో తెరకెక్కించడం సాధ్యమేనా అని… రాజమౌళి మాక్ షూట్ నిర్వహించ తలచారు.

కారణం ఏదైనా ఆయన మాక్ షూట్ జరపలేదు. దీనికి కారణం విదేశీ నిపుణులు పనిచేస్తున్న ఈ చిత్ర షూటింగ్ అందుబాటులో ఉన్న సాంకేతిక వర్గంతో పూర్తి చేయడం వలన అనుకున్న అవుట్ ఫుట్ రాదని రాజమౌళి ఆలోచనట. ఆయన కొద్దిరోజులు ఆగడమే మంచిదనే అభిప్రాయంలో ఉన్నారన్న మాట వినిపిస్తుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు