ఈరోజు లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా మెగా ఫ్యాన్స్ అంతా సోషల్ మీడియాలో సంబరాలు జరుపుకుంటున్నారు. అలాగే ఈ బిగ్ డే రోజున రానున్న సర్ప్రైజ్ కోసం కూడా వారు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. మెగాస్టార్ చిరు నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ఫస్ట్ లుక్ మరియు మోషన్ పోస్టర్ టీజర్ లు విడుదల కానుండటంతో అది ఎలా ఉండనుందా అని మెగా ఫ్యాన్స్ కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు.
ఈరోజు సాయంత్రం 4 గంటలకు విడుదల చేయనున్న ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే టైటిల్ కూడా ఏమిటి అన్నది రివీల్ చెయ్యనున్నారు.చిరు నుంచి ఒక సందేశాత్మక చిత్రం వస్తుంది అంటేనే ఒక బెంచ్ మార్క్ ఉంది. మరి అలాంటప్పుడు అలాంటి సినిమాల స్పెషలిస్ట్ బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివతో తీస్తున్న ఏఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. పైగా మణిశర్మ సంగీతం కావడంతో తారా స్థాయి అంచనాలు ఉన్నాయి. దీనితో మెగా ఫ్యాన్స్ మరియు మూవీ లవర్స్ ఈ కాంబో నుంచి రానున్న మెగా ట్రీట్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు.


