ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళి మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లతో తెరకెక్కిస్తున్న భారీ పీరియాడిక్ వండర్ “రౌద్రం రణం రుధిరం”. ఇప్పటికే భారీ అంచనాలు నెలకొలుకున్న ఈ చిత్రం షూటింగ్ కూడా కొన్నాళ్లలో మొదలు కానుంది. అయితే ఇప్పుడు లేటెస్ట్ గా ఈ చిత్రంలో ఒక కీలక అంశం హాట్ టాపిక్ గా మారింది.
ఈ చిత్రంలో ఒక ఫీమేల్ లీడ్ గా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ నటించనుంది అన్న సంగతి అందరికీ తెలిసిందే. అప్పట్లో అనౌన్స్ చేసినపుడు బాగానే ఉన్నా ఇప్పుడు ఆలియా పేరు ఉండటమే కాస్త ఇబ్బందిలా మారే పరిస్థితి నెలకొంది.ఇటీవలే సుశాంత్ మరణం ఘటన చాలా దుమారం రేపింది.
దీనితో బాలీవుడ్ వర్గాల్లో ఆడియన్స్ ఆలియా భట్ సినిమాలపై ఆడియన్స్ పెద్ద ఎత్తున మండిపడుతున్నారు. ఇప్పుడు ఆ ఎఫెక్ట్ RRR పై పడింది అని పెద్ద ఎత్తున వినిపిస్తుంది. అలాగే మరోపక్క ఆలియా ను రీప్లేస్ చేస్తూ ప్రియాంకా చోప్రా నటించనుంది అని మరిన్ని రూమర్స్ వినిపిస్తున్నాయి. మొత్తానికి మాత్రం ఇప్పుడు ఈ అంశం హాట్ టాపిక్ అయ్యింది. మరి ఈ అంశంపై సరైన క్లారిటీ రావాల్సి ఉంది.


