ఒక్క మన దేశంలోనే కాకుండా మొత్తం ప్రపంచ వ్యాప్తంగా బిగ్గెస్ట్ రియాలిటీ గేమ్ షో “బిగ్ బాస్” కు మంచి క్రేజ్ ఉంది. అలాగే మన తెలుగులో కూడా బిగ్ బాస్ క్రేజ్ ఇండియా వైడ్ సెన్సేషన్ ను రేపింది. అయితే హిందీలో ఎప్పటి నుంచో హోస్ట్ గా అక్కడి బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖానే చేస్తున్నారు. ఇప్పటి వరకు అక్కడ మొత్తం 13 సీజన్ లు పూర్తయ్యి ఇప్పుడు 14 వ సీజన్లోకి అడుగు పెట్టారు.
ఈసారి కూడా సల్లూ భాయే మళ్ళీ హోస్ట్ చేస్తున్నారు. అయితే ఈసారి సీజన్ కు సల్మాన్ గట్టి రెమ్యునరేషన్ నే తీసుకుంటున్నారని టాక్ వినిపిస్తుంది.అయితే ఇక్కడ రెండు వెర్షన్ లు వినిపిస్తున్నాయి ఒక పక్క సల్మాన్ ఒక్కో ఎపిసోడ్ కు 10 కోట్లు చొప్పున తీసుకుంటున్నాడని మరోపక్క మొత్తంగా కలిపి 250 కోట్లు రెమ్యునరేషన్ మేకర్స్ ఇచ్చేందుకు డీల్ కుదుర్చుకున్నారని టాక్ వినిపిస్తుంది. మరి ఈ రెండిటిలో ఏది నిజమో అన్నది తెలియాల్సి ఉంది.


