‘రాధే శ్యామ్’లో పూజా రోల్ పై ఇంట్రస్టింగ్ అప్ డేట్ !

‘రాధే శ్యామ్’లో పూజా రోల్ పై ఇంట్రస్టింగ్ అప్ డేట్ !

Published on Aug 30, 2020 10:58 PM IST

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రాబోతున్న సినిమా ‘రాధే శ్యామ్’. సినిమా గురించి ఓ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఈ చిత్రంలో పూజా హెగ్డే డ్యూయెల్ రోల్ లో నటిస్తోందని.. కాకపోతే ట్విన్స్ అయినా పూజా ఇద్దరిలో ఒకరూ సినిమా మొదలైన నాలుగు సినిమాలకే చనిపోతుందని తాజాగా రూమర్ వినిపిస్తోంది. ఈ సినిమా పీరియాడిక్ మూవీ కావడంతో పూజా గెటప్ కూడా ఆనాటి ట్రెడిషనల్ క్లాసిక్ డాన్సర్ ను పోలి ఉంటుందట.

కాగా రివేంజ్ స్టోరీతో సాగే ఓ థ్రిల్లింగ్ ప్రేమకథగా రానున్న ఈ సినిమా లాక్ డౌన్ కి ముందు జార్జియాలో చిత్రీకరణ జరుపుకుంది. కానీ ఇప్పుడు మళ్లీ అక్కడ షూట్ చేసే పరిస్థితి లేదు. అందుకే మిగిలిన బ్యాలెన్స్ పార్ట్ షూట్ ను హైదరాబాద్ లోని అల్యూమినియమ్ ఫ్యాక్టరీలో అక్టోబర్ నుండి షూట్ చేయనున్నారు. కాగా మూడు భాషల్లో తెరకెక్కనున్న ఈ చిత్రాన్నీ గోపికృష్ణ మూవీస్ , యువీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

తాజా వార్తలు