ఫైనల్ డెసిషన్ మెగాస్టార్ దేనా.?

ఫైనల్ డెసిషన్ మెగాస్టార్ దేనా.?

Published on Sep 6, 2020 6:17 PM IST

టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివతో “ఆచార్య” అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించి ఇంకా మిగిలి ఉన్న షూటింగ్ కూడా త్వరలోనే మొదలు కానుంది. అయితే చిరు లుక్ మొత్తం సెట్ అయ్యాక ఈ షూట్ మొదలు కానుండగా చిరు ఈ చిత్రం తర్వాత నటించబోయే సినిమాలకు సంబంధించి ఇంకా సరైన క్లారిటీ రావాల్సి ఉంది.

ఈ చిత్రం తర్వాత మెగాస్టార్ లైనప్ లో రెండు రీమేక్ చిత్రాలు ఉన్న సంగతి తెలిసిందే. వీటిలో ఒకటి వివి వినాయక్ దర్శకత్వంలో “లూసిఫర్” రీమేక్ కాగా మరొకటి మెహర్ రమేష్ తో “వేదాళం” రీమేక్. అయితే వీటిలో ఏ చిత్రం ముందుగా మొదలు అవుతుంది అన్నది ఇంకా క్లారిటీ రాలేదు. దీనితో ఫైనల్ డెసిషన్ ఏమిటి అన్నది చిరు మీదనే ఆధారపడి ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే రెండు చిత్రాల స్క్రిప్ట్ పనులు పూర్తయ్యాయి. ఇక చిరు దేనికి ముందు సై అంటే అదే ముందు మొదలు కానుంది.

తాజా వార్తలు