మన టాలీవుడ్ టాప్ హీరోస్ లో ఒకరైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిత్రాలను సరిగ్గా గమనిస్తే ఇతర స్టార్ హీరోల సినిమాలతో కాస్త విభిన్నంగా ఉన్నట్టు అనిపిస్తాయి. అది స్ట్రైట్ సినిమా అయినా సరే రీమేక్ సినిమా అయినా సరే. సినిమా టాకింగే బహుశా తెలిసినవే అయినా ఏదో సెపరేట్ ప్రపంచంలో తీసినట్టు కొత్తగా అనిపిస్తుంది.
అలాగే తన రీమేక్ సినిమాలు కూడా పూర్తిగా తన ట్రేడ్ మార్క్ లోకి మార్చేసుకుంటారు. అందుకు బెస్ట్ ఎగ్జామ్పుల్ గా బ్లాక్ బస్టర్ హిట్ అయిన “గబ్బర్ సింగ్” ను చెప్పాలి. ఇప్పుడు పవన్ చేస్తున్న “వకీల్ సాబ్” ను కూడా అదే తరహాలో ప్లాన్ చేస్తున్నారట. గబ్బర్ సింగ్ లా అంటే మళ్ళీ దానిలా ఎంటర్టైన్మెంట్ తరహాలా కాదు.
మెయిన్ కోర్ లైన్ ను తీసుకొని మన దగ్గరకు తగ్గట్టుగా చాలా మార్పులు చేర్పులు చేసినట్టుగా వకీల్ సాబ్ చిత్రానికి కూడా చాలా ఇంట్రెస్టింగ్ డెవలెప్మెంట్స్ ను దర్శకుడు శ్రీరామ్ వేణు చేశారట. అలాగే పవన్ పాత్రను కూడా సరికొత్తగా డిజైన్ చేసినట్టు తెలుస్తుంది. ఇది ప్రతీ ఒక్కరికీ నచ్చేలా ఉంటుందని టాక్ వినిపిస్తుంది. ఈ చిత్రం షూట్ వచ్చే డిసెంబర్ లో తిరిగి మొదలు కానుండగా దిల్ రాజు నిర్మిస్తున్నారు.


