టాలీవుడ్ ఎనెర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా నటించిన లాస్ట్ అండ్ లేటెస్ట్ చిత్రం “ఇస్మార్ట్ శంకర్”. ఈ చిత్రంతో ఒక సాలిడ్ కం బ్యాక్ హిట్ ను అందుకోవడమే కాకుండా తన బాక్సాఫీస్ ఫిగర్స్ ను కూడా పెంచుకున్నాడు. వీటితో పాటుగా మాస్ ఆడియెన్స్ లో కూడా మంచి క్రేజ్ ను పెంచుకున్న రామ్ తర్వాత స్వీయ నిర్మాణంలో “రెడ్” చిత్రాన్ని అనౌన్స్ చేసి మళ్ళీ మంచి హైప్ ను తెచ్చుకున్నాడు.
అలాగే ఈ మధ్యలోనే నెలకొన్న పరిస్థితుల మూలాన ఓటిటి విడుదలలు ఎక్కువయ్యాయి. అందులో భాగంగానే ఈ సినిమాకు కూడా ఆఫర్స్ బాగానే వచ్చాయి కానీ వీరు మాత్రం థియేట్రికల్ రిలీజ్ కే స్టిక్ అయ్యి ఉన్నారు. కానీ తర్వాత మాత్రం ఓ ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థకు ఒకే చెప్పినప్పటికీ మాత్రం రివర్స్ వాళ్ళు నో చెప్పారట. దీనితో చిత్రం మేకర్స్ కు మరో దారి లేక థియేటర్స్ లోనే విడుదల చెయ్యడానికి మళ్ళీ రెడీ అవుతున్నట్టు టాక్.కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రామ్ సరసన మాళవికా శర్మ హీరోయిన్ గా నటిస్తుండగా మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.


