“ఆదిపురుష్”ను మోయగలిగే సత్తా ఆయనకుంది.!

“ఆదిపురుష్”ను మోయగలిగే సత్తా ఆయనకుంది.!

Published on Sep 13, 2020 4:12 PM IST

ఇప్పుడు మన దేశంలోనే మోస్ట్ ఎక్స్ పెన్సివ్ ప్రాజెక్ట్ లా ప్రభాస్ నటించనున్న “ఆదిపురుష్” అవతరించనుంది. ఇంకా ఎలాంటి షూట్ మొదలు కాకుండానే ఊహలకు మించిన హైప్ నే ఈ చిత్రం మూటగట్టుకుంది. బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ ఎందుకో ఈ చిత్రాన్ని చాలా స్పెషల్ అండ్ ప్రిస్టేజియస్ గా తీసుకున్నారు. అందుకే భారీ విజువల్స్ తో ఉన్నత ప్రామాణికాలతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నారు.

అయితే ఎంత పెద్ద సినిమా అయినా అందుకు తగ్గట్టుగా కనుక సౌండింగ్ లేకపోతే అది కిరీటం లేని రాజు లానే అనిపిస్తుంది. విజువల్ గా సినిమా ఎంత స్ట్రాంగ్ గా కనిపించినా అందుకు తగ్గట్టుగా కానీ సౌండింగ్ స్కోర్ ఉంటే ఆ చిత్రం మరో స్థాయిలోకి వెళ్తుంది. అందుకు ఉదాహరణగా ఎన్నో చిత్రాలు ఉన్నాయి. మరి అలాంటి ఈ చిత్రానికి సంగీతం విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలి? అందుకే చిత్ర యూనిట్ కూడా ఈ విషయంలో చాలా కేర్ తీసుకుంటున్నారు.

అందుకు తగ్గట్టుగానే గ్రాండియర్ మ్యూజిక్ ను ఇచ్చే సంగీత దర్శకుల పేర్లు ఇప్పుడు పరిశీలనలోకి వస్తుండగా మన టాలీవుడ్ ఆడియెన్స్ కూడా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రానికి ఎం ఎం కీరవాణి గారు కూడా ఏమాత్రం తగ్గకుండా సంగీతం అందివ్వగలరని అంటున్నారు. కీరవాణి సంగీతం ఏ స్థాయిలో ఉంటుందో తెలిసిందే. బాహుబలి లోని ఎమోషన్స్ కు ఆయన అందించిన సంగీతం ఆ చిత్రానికే ఆయువు పట్టులా నిలిచింది.

అలాగే లేటెస్ట్ గా “RRR” మోషన్ మోస్టర్ లో వినిపించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా గ్రాండియర్ గా అనిపించిందని అంతా అభిప్రాయపడ్డారు. ఆ రకంగా ఖచ్చితంగా కీరవాణి ఇలాంటి ఇతిహాస గాథను మోయగలిగే సత్తా ఉన్నవారిని టాలీవుడ్ తరపున సినీ ప్రేమికులు అదిపురుష్ టీం కు సజెస్ట్ చేస్తున్నారు. ప్రస్తుతానికి అయితే ఈ చిత్రానికి ఏ ఆర్ రెహమాన్ పేరు ఎక్కువగా వినిపిస్తుంది. మరి చిత్ర యూనిట్ ఎవరిని ఫైనల్ చేయనున్నారో చూడాలి.

తాజా వార్తలు