పరిస్థితులు బాగోలేక ఈ మధ్య కాలంలో ఓటిటిలో విడుదలై మంచి స్పందనను అందుకున్న అతి హీరోగా తక్కువ చిత్రాల్లో “ఉమామహేశ్వర ఉగ్రరూపస్య” చిత్రం కూడా ఒకటి. టాలెంటెడ్ నటుడు సత్యదేవ్ హీరోగా రూప హీరోయిన్ గా వెంకటేష్ మహా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఓటిటిలో హిట్ చిత్రంగా నిలిచింది అని చెప్పొచ్చు.
మలయా చిత్రం “మహేశిన్తే ప్రతీకారం” కు రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రం నెట్ ఫ్లిక్స్ లో డైరెక్ట్ స్ట్రీమింగ్ కు వచ్చి మంచి రెస్పాన్స్ ను అందుకుంది. అయితే ఈ చిత్రాన్ని కనుక ఒకవేళ మిస్సయిన వారికి మళ్ళీ స్మాల్ స్క్రీన్ పై చూడాలనుకునే వారికి ఈరోజు ఆ అవకాశం దక్కింది.
తెలుగు టాప్ ఛానెల్స్ లో ఒకటైన “ఈటీవీ తెలుగు” వారు ఈ చిత్రం తాలూకా సాటిలైట్ హక్కులను దక్కించుకున్న సంగతి తెలిసిందే. వారు ఈ రోజు ఈ చిత్రాన్ని వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా సాయంత్రం 6 గంటలకు టెలికాస్ట్ చేయనున్నారు. ఇంటిల్లిపాది చూడదగ్గ ఈ చిత్రాన్ని ఒకవేళ అప్పుడు కనుక మీరు మిస్సయితే ఈసారి చూసే అవకాశం వచ్చింది.


