రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మన ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ సృష్టించనున్న చిత్రాల జాబితాలో “కేజీయఫ్ చాప్టర్ 2” పేరును కూడా తప్పకుండా ఉంచాల్సిందే. ఆ రేంజ్ లో ఈ చిత్రం కోసం మన ఇండియన్ ఫిల్మీ లవర్స్ ఎదురు చూస్తున్నారు. కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ క్రేజీ చిత్రం పై తారా స్థాయి అంచనాలు ఉన్నాయి.
చాప్టర్ 1 భారీ హిట్ కావడంతో ఈ చిత్రంపై కూడా అంతకు మించిన అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఈ సినిమాకు సంబంధించి చిత్ర యూనిట్ ఇపుడు టీజర్ తో బ్లాస్ట్ ను ప్లాన్ చేస్తున్నట్టు బజ్ వినిపిస్తుంది. పరిస్థితులు బాగుండి ఉంటే ఈ పాటికే వచ్చేసి ఉండాలి అలాగే వచ్చే అక్టోబర్ నెలలోనే సినిమా కూడా గ్రాండ్ రిలీజ్ అవ్వాల్సి ఉంది.
కానీ లాక్ డౌన్ మూలాన సినిమా రిలీజ్ టైం కి ఈ చిత్ర టీజర్ ను నీల్ అండ్ టీం ప్లాన్ చేస్తున్నట్టుగా గాసిప్స్ వినిపిస్తున్నాయి.అంటే వచ్చే అక్టోబర్ 25న అన్నట్టు బజ్.అలాగే దసరా మహోత్సవం కూడా ఉండడంతో ఇలా ప్లాన్ చేసినట్టు టాక్. ఈ మాస్ ఎమోషనల్ ఎంటర్టైనర్ కోసం మన టాలీవుడ్ అభిమానులు కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు. మరి ఈ చిత్రం టీజర్ బ్లాస్ట్ అప్పుడు వస్తుందో లేదో చూడాలి.


