సినిమా టైటిల్స్ విషయంలో వివాదాలు జరగడం కొత్తేమీ కాదు. తాజాగా ఈ టైటిల్ గొడవ ‘నాయక్’ సినిమాని కూడా తాకింది. ఈ సినిమా టైటిల్ మార్చాలని ఉస్మానియా యూనివర్సిటీలో గిరిజన విద్యార్ధుల సంఘ నాయకులు ఆందోళనకి దిగారు. ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీలో గిరిజన విద్యార్ధి సంఘాల నాయకులూ మాట్లాడుతూ ‘నాయక్’ రాజ్యాంగం తమ గిరిజనులకు హక్కుగా ఇచ్చిందని, ఇప్పుడు ఈ పదాన్ని ఈ సినిమాకి వాడుకోవడం తమని అవమానించినట్లుగా ఉందని అన్నారు. గతంలో కొమరం పులి అనే సినిమా విషయంలో ఇలాగే జరిగితే కొమరం అనే పదాన్ని తొలగించారు. ఇప్పుడు ఈ సినిమాకి కూడా నాయక్ అనే టైటిల్ మార్చాలని లేని పక్షంలో సినిమాని అడ్డుకుంటామని అన్నారు. సినిమా టైటిల్ విషయాల్లో వివాదాలు తలెత్తడం గతంలో ఖలేజా, కొమరం పులి, ఢమరుకం సినిమాల విషయంలో చూసాము. ఈ మూడు సినిమాలకి టైటిల్స్ చిన్న మార్పుతో మార్చారు.మరి నాయక్ విషయంలో ఎం జరుగుతుందో చూడాలి.
‘నాయక్’ టైటిల్ లొల్లి మొదలైంది
‘నాయక్’ టైటిల్ లొల్లి మొదలైంది
Published on Dec 25, 2012 3:36 PM IST
సంబంధిత సమాచారం
- రవితేజ ‘ఇరుముడి’కి సాలిడ్ ఓపెనింగ్స్: హైదరాబాద్, వైజాగ్‌లలో హౌస్‌ఫుల్స్‌తో అడ్వాన్స్ బుకింగ్స్ జోరు
- ట్రెండ్ సెట్టర్ రామ్ చరణ్.. తన వల్లే ఇలాంటి సినిమాలన్నీ!
- బుక్ మై షోలో ‘టాక్సిక్’కి వేరే లెవెల్ హైప్.. రియాలిటీలో మరి?
- యూఎస్ మార్కెట్ లో రికార్డు మైల్ స్టోన్ క్రాస్ చేసేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’
- రవితేజ కెరీర్లో బెస్ట్ ఓపెనింగ్స్ దిశగా ‘ఇరుముడి’!
- ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన అజయ్ భూపతి లవ్ స్టోరీ “శ్రీనివాస మంగాపురం”
- తమిళ స్టార్ డైరెక్టర్‌తో వరుణ్ తేజ్ నెక్స్ట్ మూవీ.. ఏ జోనర్లో అంటే..?
- జపాన్‌లో ‘మిరాయ్’ సెన్సేషన్.. రిలీజ్‌కు ముందే సాలిడ్ వసూళ్లు..!
- థియేటర్లలో మాస్ రాజా మాస్ ఎంటర్టైనర్ ‘మిరపకాయ్’.. రీ-రిలీజ్ డేట్ ఫిక్స్..!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- యూఎస్ మార్కెట్ లో మాస్ ర్యాంపేజ్ చూపిస్తున్న రవితేజ సినిమా!
- ‘టాక్సిక్’కి మన దగ్గర హైకులు అవసరమా?
- ఓటీటీలోకి ఘట్టమనేని జయకృష్ణ డెబ్యూ మూవీ: ‘శ్రీనివాస మంగాపురం’ స్ట్రీమింగ్ వివరాలివే!
- షాకింగ్ బజ్: రజినీకి వ్యతిరేకంగా రామ్ పోతినేని?
- నైజాంలో తెరుచుకున్న ‘ఇరుముడి’ బుకింగ్స్.. ఫ్యాన్స్ ఇక రచ్చ రచ్చే
- ఇంటర్వ్యూ : దర్శకుడు శివ నిర్వాణ – ‘ఇరుముడి’ లాంటి నేపథ్యంలో ఇప్పటివరకు సినిమా రాలేదు..!
- ఎన్టీఆర్ ఎమోషనల్ పోస్ట్.. తనని వీడి వెళ్ళిపోయిన బఘీర!
- మహేష్ ‘వారణాసి’ ఆల్బమ్ పై బిగ్ క్లారిటీ!


