పవర్ స్టార్ నిర్మాణంలో వరుణ్ తేజ్ ?

పవర్ స్టార్ నిర్మాణంలో వరుణ్ తేజ్ ?

Published on Jan 11, 2021 6:57 AM IST

Varun tej

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ బ్యానర్ లో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా ఒక సినిమా రాబోతుందని తెలుస్తోంది. రచయిత కోన వెంకట్ అందించిన కథతో ఈ సినిమా తెరకెక్కబోతుందని తెలుస్తోంది. కాకపోతే ఈ సినిమాకి ఇంకా దర్శకుడిని ఫైనల్ చేయలేదట. ఇది జరిగితే, ఇది మెగా అభిమానులకు శుభ వార్తనే. మరి ఈ వార్త నిజం అవుతుందేమో చూడాలి. మరో పక్క పవర్ స్టార్ సైతం రీఎంట్రీ ఇస్తూ వరుస సినిమాలకు సైన్ చేసిన సంగతి తెలిసిందే.

‘పింక్’ తెలుగు రీమేక్ వకీల్ సాబ్, అలాగే క్రిష్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న ఆయన వీటి తర్వాత హరీష శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి ఒప్పుకున్నారు. ఈ ప్రాజెక్ట్స్ అన్నీ వచ్చే ఏడాది కల్లా పూర్తైపోతాయి. పవన్ 2022లో కూడా సినిమాలు చేసే ఆలోచనలో ఉండటంతో దర్శకుడు డాలీ కూడా సినిమా చేయడానికి పవన్ నుండి సానుకూల స్పందనే వచ్చిందని, అన్నీ కుదిరితే సినిమా ఓకే అయి, 2022లో వచ్చే అవకాశం ఉంది. అలాగే పవన్ ప్రస్తుతం రీమేక్ ఫిల్మ్స్ పై కూడా బాగా ఆసక్తి చూపిస్తున్నాడు.

తాజా వార్తలు