మరోసారి బుల్లితెర మీద యంగ్ టైగర్ హంగామా

మరోసారి బుల్లితెర మీద యంగ్ టైగర్ హంగామా

Published on Mar 10, 2021 3:01 AM IST

NTR

వెండి తెర మీద నటుడిగానే కాకుండా బుల్లితెరపై వ్యాఖ్యతగా కూడ ఎన్టీఆర్ బోలెడంత క్రేజ్ సంపాదించుకున్నారు. బిగ్ బాస్ రియాలిటీ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరించి ప్రతి ఇంటికీ చేరువయ్యారు. అక్కినేని నాగార్జున తర్వాత అంత ప్రభావితంగా ఒక షోను హోస్ట్ చేయగల నటుడిగా పేరు తెచ్చుకున్నారు. త్వరలోనే ఆయన మరొక షోను హోస్ట్ చేయనున్నారు. అదే జెమినీ టీవీ నిర్వహించే ‘ఎవరు మీలో కోటీశ్వరుడు’ కార్యక్రమం. గతంలో ఈ షోను నాగార్జున, చిరంజీవి హోస్ట్ చేయగా ఇప్పుడు ఎన్టీఆర్ చేయనున్నారు.

మార్చి13వ తేదీన ఈ విషయమై అధికారిక ప్రకటన వెలువడనుంది. ఈ కార్యక్రమం కోసం జెమినీ టీవీ యాజమాన్యం ఆయనకు పెద్ద మొత్తంలోనే పారితోషకం చెల్లిస్తున్నట్టు తెలుస్తోంది. ఇకపోతే తారక్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ నటిస్తున్నారు. అది పూర్తైన వెంటనే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక సినిమా చేసే ఆలోచనలో ఉన్నారు. దీనికి సంబంధించి కూడ త్వరలోనే అఫీషియల్ ప్రకటన వెలువడే అవకాశం ఉంది. మొత్తానికి తారక్ సినిమాలు, టీవీ షోలు, వాణిజ్య ప్రకటనలతో బిజీబిజీ మారిపోయారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు